కింగ్ అక్కినేని నాగార్జున ప్రస్తుతం చేస్తున్న మూవీ మన్మధుడు 2. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమా ఆగస్టు 9న రిలీజ్ చేయాలనీ చూస్తున్నారు. అయితే ఆ తరువాత వారం ప్రభాస్ సాహో ఆగస్టు 15న వస్తుంది అని తెలిసి కూడా ఏం భయపడకుండా ఒక వారం ముందు వస్తున్నాడు నాగ్.
ఇక ఈనెల మొత్తం సినిమాల జోరు మాములుగా లేదు. ఈరోజు సామ్ నటించిన ఓ బేబీ రిలీజ్ అవ్వబోతుంది. అలానే జూలై 18న ఇస్మార్ట్ శంకర్, 25న డియర్ కామ్రేడ్, ఆగస్టు 2న రణరంగం, రాక్షసుడు, గుణ 369, 9న మన్మధుడు 2, 15న సాహో, 31 గ్యాంగ్ లీడర్, సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో వాల్మీకి ఇలా వరసగా మీడియం రేంజ్ సినిమాలు లైన్ కట్టాయి.
ఇక అందుకే జూలైలో రాకుండా ఆగస్టులో వస్తే బెటర్ అని అలోచించి ఆగస్టు 9 న వస్తున్నాడు నాగార్జున. ఈనెల మిస్ అయితే మళ్లీ మంచి డేట్ దొరకదని ఎట్టిపరిస్థితుల్లో 9 న రావాలని డిసైడ్ అయ్యాడు నాగ్.