Advertisementt

‘సైరా’లో పృథ్వీ సీన్స్ పీకేశారా.. ఇది నిజమేనా!?

Sat 06th Jul 2019 07:06 PM
megastar chiranjeevi,prithviraj,scenes,syeraa  ‘సైరా’లో పృథ్వీ సీన్స్ పీకేశారా.. ఇది నిజమేనా!?
News about prithviraj scenes cut in Sye Raa Movie ‘సైరా’లో పృథ్వీ సీన్స్ పీకేశారా.. ఇది నిజమేనా!?
Advertisement
Ads by CJ

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందు.. ఫలితాల తర్వాత టాలీవుడ్‌లో ఎక్కువసార్లు వినపడిన వాయిస్ థర్టీ ఇయర్స్ పృథ్వీరాజ్‌దే. ఆయన మాట్లాడిన మాటలు కొన్ని అతిగా ఉన్నా.. మరికొన్ని మాత్రం కొందరికి ఎక్కడో టచ్ అయ్యాయి. మరీ ముఖ్యంగా మెగా బ్రదర్స్‌ పవన్ కల్యాణ్, నాగబాబులపై ఎన్నికల టైమ్‌లో పృథ్వీ కొంచెం ఎక్కువగానే మాట్లాడారని మెగాభిమానులు, జనసేన కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎన్నికల ఫలితాల అనంతరం కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని టాలీవుడ్‌ ఎందుకు పట్టించుకోవట్లేదంటూ మరోసారి విమర్శలు గుప్పించారు. దీంతో పృథ్వీ మరోసారి అటు తెలుగు రాష్ట్రాల రాజకీయాలు.. టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయ్యారు. పృథ్వీ మాట్లాడిన మాటలకు ఫలితంగా పలు సినిమాల్లో ఆయన అవకాశాలు కూడా కోల్పోయారని ఫిల్మ్‌నగర్‌లో టాక్ నడిచింది. మెగా హీరోల సినిమాల్లో ఆయన్ను వద్దనుకున్నారని.. ఇక ముందు కూడా మెగా హీరోల బ్యాన్ విధించాలని భావించినట్లుగా వార్తలు పెద్ద ఎత్తున వచ్చాయి.

తాజాగా.. ఏకంగా మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన ‘సైరా’ సినిమాలో పృథ్వీ సీన్‌లను పీకేశారని వార్తలు గుప్పుమంటున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఇదే విషయంపైనే అందరూ చర్చించుకుంటున్నారు. అయితే ఇది ఎంత వరకు నిజం..? నిజంగానే సైరా టీమ్ ఇలా చేసిందా..? అని పృథ్వీని అడగ్గా.. మెగాస్టార్ చిరంజీవి చాలా మంచి వ్యక్తి.. మ‌రీ అంత సిల్లీ థింగ్స్ చేయ‌రనే తాను అనుకుంటున్నానన్నారు. తాను టాలెంట్‌‌‌ను న‌మ్ముకుని వ‌చ్చానని.. సొంతంగానే ఎదుగుతాన‌ని ఈ సందర్భంగా ఆయన తేల్చిచెప్పారు. నిజంగానే ఈయన సీన్స్ అన్నీ కట్ చేశారా..? అనేది తెలియాలంటే మూవీ రిలీజ్‌ అయ్యేవరకు వేచి చూడాల్సిందే మరి.

News about prithviraj scenes cut in Sye Raa Movie:

News about prithviraj scenes cut in Sye Raa Movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ