Advertisementt

శ్రీముఖి.. ఏంటీ హడావుడి.. క్లూ ఇచ్చినట్లేనా!

Sat 06th Jul 2019 07:36 PM
anchor srimukhi,fans,srimukhi army,bigboss-3  శ్రీముఖి.. ఏంటీ హడావుడి.. క్లూ ఇచ్చినట్లేనా!
Anchor Srimukhi Fans, Followers Hulchal in Social media శ్రీముఖి.. ఏంటీ హడావుడి.. క్లూ ఇచ్చినట్లేనా!
Advertisement
Ads by CJ

బిగ్‌బాస్-3 కంటెస్టెంట్‌గా టాలీవుడ్ యాంకర్ శ్రీముఖి అలియాస్ అరుపుల రాములమ్మ వెళ్తున్నట్లు గత కొన్ని రోజులుగా అటు సోషల్ మీడియాలో ఇటు వెబ్‌సైట్లలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ పుకార్లపై ఇంత వరకూ ఈ యాంకరమ్మ స్పందించలేదు కానీ.. ఆమె సోషల్ మీడియాలో ప్రవర్తిస్తున్న తీరును బట్టి చూస్తే బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ పక్కానే అని అనిపిస్తోంది.

ఇదిగో ఇలా పుకార్లు మొదలయ్యాయో లేదో కానీ.. అభిమానులు, పటాస్ ప్రియులు పెద్దఎత్తున గ్రూపులు కట్టేసి ‘శ్రీముఖి ఆర్మీ’ ఏర్పాటు చేసేశారట. వాస్తవానికి శ్రీముఖి యాంకర్ అయినప్పటికీ.. పెద్ద పెద్ద సెలబ్రిటీలకు ఉండే రేంజ్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వీరందరూ ఇప్పుడు ఏకమై ‘శ్రీముఖి ఆర్మీ’ ఏర్పడ్డారట. ఫేస్‌‌బుక్, ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్ ఇలా ఈ చెత్తా, ఆ చెత్తా అనే తేడా లేకుండా శ్రీముఖి పేరిట పేజీలన్నీ సిద్ధం చేసేశారట.

బిగ్‌బాస్-2 సీజన్‌లో కంటెస్టెంట్‌ కౌశల్‌ను గెలిపించింది కూడా ఈ ఆర్మీనే.. అందుకే ఆ ఆర్మీ పవరేంటో తెలుసుకున్న శ్రీముఖి హౌస్‌లోకి ఎంటర్ కాకమునుపే ఇలా తన సన్నిహితులు, ఫాలోవర్స్‌తో హడావుడి చేయిస్తోందని టాక్ నడుస్తోంది. అయితే ఇంత వరకూ తాను బిగ్‌బాస్‌లోకి వెళ్తోంది అనడానికి ఈ మాత్రం క్లూ చాలాదా.. అని నెటిజన్లు చెప్పుకుంటున్నారు. ఒకవేళ శ్రీముఖి కంటెస్టెంట్‌గా వెళ్లడం నిజమయితే పరిస్థితి మామూలుగా ఉండదేమో.

Anchor Srimukhi Fans, Followers Hulchal in Social media:

Anchor Srimukhi Fans, Followers Hulchal in Social media

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ