Advertisementt

వైఎస్ బతికుంటే విజయనిర్మలకు పద్మభూషణ్!

Mon 08th Jul 2019 04:55 PM
vijayanirmala,padmbushan,ghattameni krishna,mahesh babu fans  వైఎస్ బతికుంటే విజయనిర్మలకు పద్మభూషణ్!
News About vijayanirmala padmbushan వైఎస్ బతికుంటే విజయనిర్మలకు పద్మభూషణ్!
Advertisement
Ads by CJ

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికుంటే ఘట్టమేని కృష్ణ అనుకున్నవన్నీ జరిగేవట. అంతేకాదు.. తన సతీమణి, ఇటీవల కన్నుమూసిన విజయనిర్మలకు ‘పద్మభూషణ్’ ఇప్తిస్తామని వైఎస్ చెప్పినట్లు కృష్ణ చెప్పుకొచ్చారు. విజయనిర్మల సంతాప సభలో మాట్లాడిన కృష్ణ పై వ్యాఖ్యలు చేశారు.

గిన్నిస్ రికార్డ్ హోల్డర్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న విజ‌య‌నిర్మల‌కు ర‌ఘుప‌తి వెంకయ్యనాయుడు అవార్డుతో పాటు పలు అవార్డులు ఆమెను వరించాయని.. అయితే వైఎస్ బతికుంటే విజయనిర్మలకు తప్పకుండా ‘పద్మభూషణ్‌’ వచ్చి ఉండేదన్నారు. అయితే ఈ అవార్డు ఇవ్వమని తామెవ్వరం అడగకపోయినా, తన సినీరంగ కృషిని గుర్తుపెట్టుకొని.. వైఎస్సే స్వయంగా తనకు ‘పద్మభూషణ్‌’ ఇప్పించారని కృష్ణ చెప్పుకొచ్చారు.

వైఎస్ ఈ మాటలన్నీ మాట్లాడిన తర్వాత రెండేళ్లలో ఆయన మనల్ని విడిచి వెళ్లిపోయారని కృష్ణ ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు. వైఎస్ ఉండుంటే తమ కుటుంబానికి మంచి జరిగేదని కృష్ణ తన మనసులోని మాటను బయటపెట్టారన్న మాట. మరి ఈ మాటలు విన్న వైఎస్ కుమారుడు, ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఏ మాత్రం ఘట్టమనేని కుటుంబంపై అవార్డుల వర్షం కురిపిస్తారో వేచి చూడాల్సిందే.

News About vijayanirmala padmbushan:

News About vijayanirmala padmbushan

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ