నేచురల్ స్టార్ నానితో మాత్రమే సినిమా తీస్తాను.. ఆయన తప్ప మరెవ్వరితో చేయను.. నా రెండో సినిమా నానితో చేయాలంతే అని ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ స్వరూప్ ఫిక్సయిపోయారట. నానితో సినిమా చేయడానికి గాను ఓ ప్రముఖ రచయితేనని ఫిల్మ్‌నగర్‌లో టాక్ నడుస్తోంది.
నవీన్ పొలిశెట్టి-శ్రుతి శర్మ-సుహాస్-సందీప్ నటీనటులుగా తెరెక్కించిన చిత్రం ‘ఏజెంట్ ఆత్రేయా’ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఇదే హాట్ టాపిక్ సినిమా. డిటెక్టివ్ కథతో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులు సహా ఓవర్సీస్ ఆడియన్స్‌ను బాగా మెప్పించింది. ఈ సినిమా రిలీజ్‌కు ముందు ఆ తర్వాత పెద్ద పెద్ద సినిమాలు రిలీజైనప్పటికి జనాలంతా ‘ఆత్రేయ’కే జై కొట్టేశారు.
మొదటి సినిమాతో సూపర్ అనిపించుకున్న స్వరూప్ తన రెండో సినిమా నాని- కోన కాంబినేషన్‌లోనే ఉంటుందని సమాచారం. అయితే ఈ విషయంపై స్వరూప్ మాత్రం నానితో సినిమా చేస్తున్నట్లుగానీ.. నానిని సంప్రదించినట్లుగానీ ప్రకటించలేదు. నాని - కోన అనుబంధంతో ఈ సినిమా స్వరూప్‌కు వర్కవుట్ అయినట్లు సమాచారం. అయితే ఈ ముగ్గురి కాంబినేషన్‌లో పరిస్థితి ఎలా ఉంటుంది..? ఇవన్నీ సినిమా సెట్స్ దాకా వెళ్తాయా..? లేకుంటే ఫిల్మ్ నగర్‌లోనే పుకార్లుగా మిగిలిపోతాయో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.