Advertisementt

ఆ గదిలో చిన్నారి పెళ్లికూతురు.. నిజమేనా?

Tue 09th Jul 2019 10:24 AM
avika gor,raju gari gadhi 3,tamanna,kajal,taapsee,chinnari pelli kooturu  ఆ గదిలో చిన్నారి పెళ్లికూతురు.. నిజమేనా?
Avika Gor in Raju Gari Gadhi 3 ఆ గదిలో చిన్నారి పెళ్లికూతురు.. నిజమేనా?
Advertisement
Ads by CJ

10 రోజులు కిందటే తమన్నా లీడ్ రోల్ లో యాంకర్ ఓంకార్ దర్శకత్వంలో రాజు గారి గది 3ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. మరి ఏమైందో ఏంటో సడన్ గా తమన్నా ఈ సినిమా నుండి తప్పుకుందని వార్తలు వస్తున్నాయి. కారణం ఈసినిమా కథ ముందు చెప్పిన కథ కాకుండా ఇప్పుడు వేరే కథ చేసే దాంట్లో తన  ప్రాధాన్యం తగ్గిందని అందుకే మిల్కీ బ్యూటీ వదిలేసుకుందని ఫిలిం నగర్ టాక్ ఉంది. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ యూనిట్ సభ్యులు వేరే హీరోయిన్ ని వెతికే పనిలో ఉన్నారు.

కొన్ని రోజులు కిందట కాజల్ ఫైనల్ అయిపోయిందని వార్తలు కూడా వచ్చాయి. కానీ అది నిజం కాదు. కాజల్, తాప్సి ఇద్దరు ఖాళీ లేదని చెబుతున్నారట. అందుకే యూనిట్ వేరే హీరోయిన్ ని సెర్చ్ చేసే పనిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో చిన్నారి పెళ్లి కూతురు ని తీసుకుందాం అని డిసైడ్ అయ్యారట మేకర్స్. అదేనండి అవికా గోర్. రాజ్ తరుణ్ తో ఉయ్యాల జంపాలతో డెబ్యూ చేసి ఆ తరువాత సినిమా చూపిస్త మావా-ఎక్కడికి పోతావు చిన్నవాడతో మంచి హిట్లు దక్కించుకున్న ఈ బ్యూటీ గత మూడేళ్ళ నుండి ఎందుకో టాలీవుడ్ లో కనిపించడం లేదు.

అవి పక్కన పెడితే అసలు ఈ కథకు అవికా గోర్ ఎంతవరకు సెట్ అవుతుంది? రాజు గారి గది 3 బ్రాండ్ ని మోసేంత ఇమేజ్ అవికాకు ఉందా అనేదే ప్రశ్న. అసలు ఈ వార్త నిజమో కాదో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Avika Gor in Raju Gari Gadhi 3:

Avika Gor Re Entry Confirmed 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ