Advertisementt

వాడ్ని చెప్పుతో కొట్టండి.. : శ్రీహరి భార్య

Tue 09th Jul 2019 09:34 PM
disco santhi,srihari wife,casting couch,tollywood,rajdoot  వాడ్ని చెప్పుతో కొట్టండి.. : శ్రీహరి భార్య
Srihari Wife Disco Santhi Sensational Comments on Casting Couch వాడ్ని చెప్పుతో కొట్టండి.. : శ్రీహరి భార్య
Advertisement
Ads by CJ

సినిమా ఇండస్ట్రీలో తమకు ఫలానా వాళ్లు అన్యాయం చేశారు.. అలా చేశారు.. ఇలా చేశారు అని నటీమణులు మీడియా, సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తూ మీటూ అంటూ ఉద్యమాన్ని లేవనెత్తిన విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీలోనూ క్యాస్టింగ్ కౌచ్ అంటూ పెద్ద హడావుడే జరిగింది. ఈ వ్యవహారంలో పలువురు నటీమణులు పక్కా ఆధారాలతో సహా పెద్దింటి పిల్లలను పట్టించేశారు కూడా.

తాజాగా.. ఈ వ్యవహారంపై మాట్లాడిన దివంగత నటుడు శ్రీహరి సతీమణి డిస్కో శాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడిన ఆమె.. తాను ఒక్కటి రెండు కాదు.. ఏకంగా 900 సినిమాలు చేసాన‌ని చెప్పుకొచ్చిన ఆమె ఎప్పుడూ ఇలాంటి ఇబ్బందులు పడలేదని.. అప్పట్లో సెట్‌లో కానీ.. బ‌య‌ట గానీ ఎవరూ త‌న‌తో అస‌భ్యంగా ప్రవ‌ర్తించ‌లేద‌ని చెప్పుకొచ్చింది.

అంతటితో ఆగని ఆమె.. ఎవరైనా ఇలా నిజంగానే అసభ్యంగా ప్రవర్తిస్తే అంద‌రూ చూస్తుండ‌గానే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా చెప్పుతో కొట్టాల‌ని సలహా ఇచ్చింది. ఒకప్పుడు పరిస్థితులు వేరు.. ఇప్పుడు పరిస్థితులు వేరని చెప్పుకొచ్చింది. ఒక‌ప్పుడు ఇండ‌స్ట్రీ చాలా క్లీన్‌గా ఉండేద‌ని.. మ‌ర్యాదలు ఇచ్చిపుచ్చుకునేవాళ్లని ఈ సందర్భంగా డిస్కో శాంతి వ్యాఖ్యానించింది. అంటే పరోక్షంగా ఇప్పుడున్న ఇండస్ట్రీపై ఒకింత షాకింగ్ కామెంట్స్ చేశారన్న మాట.

Srihari Wife Disco Santhi Sensational Comments on Casting Couch:

Disco Santhi Talks about Casting Couch

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ