Advertisementt

సందీప్ కిషన్ కష్టానికి తగ్గ విజయం దక్కింది!

Sun 14th Jul 2019 09:40 PM
ninu veedani needanu nene,sundeep kishan,happy,movie success  సందీప్ కిషన్ కష్టానికి తగ్గ విజయం దక్కింది!
Sundeep Kishan Happy with Ninu Veedani Needanu Nene Movie Success సందీప్ కిషన్ కష్టానికి తగ్గ విజయం దక్కింది!
Advertisement
Ads by CJ

అంతా అయిపోయింది.. ఇక ఈ హీరో మళ్ళీ కెరీర్‌లో ఎదగలేడు అని.. కేవలం ప్రేక్షకులే కాదు.. ఇండస్ట్రీలోని చాలామంది నిర్మాతలు కూడా అన్నారు. కానీ నాలుగైదు సినిమాలు పోతేనేమి నేను మళ్ళీ హీరోగా నిలదొక్కుకోగలను అని నమ్మి కష్టపడిన ఆ యంగ్ హీరో ఇప్పుడు సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. మరా హీరో ఎవరో కాదు వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సందీప్ కిషన్. మధ్యలో రెండు మూడు సినిమాలు హిట్ అయినా... తర్వాత మాత్రం సక్సెస్ అనే దానికి బాగా దూరమయ్యాడు. అనేక సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో... కెరీర్ లో బాగా వెనకబడి మార్కెట్ లో జీరో పొజిషన్ నుండి మళ్ళీ ఇప్పుడు తేరుకున్నాడు.

మొన్న శుక్రవారం సందీప్ కిషన్ నటించిన ‘నిను వీడని నీడను నేనే’’ సినిమా పెద్దగా అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక్కడ పెద్దగా అంచనాలు లేవని ఎందుకన్నామంటే.. సందీప్ కిషన్ నటించిన గత సినిమాలన్నీ భారీ డిజాస్టర్స్ కావడంతో.. ప్రస్తుతం సందీప్ నటించిన సినిమా మీద ఎలాంటి అంచనాలు లేకుండా పోయాయి. కానీ మంచి ప్రమోషన్స్ తో నిను వీడ‌ని నీడ‌ను నేనే సినిమాతో ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ కలిగించాడు. కాబట్టే ఈ నిను వీడ‌ని నీడ‌ను నేనే సినిమా.. సందీప్ గత సినిమాల కంటే ఐదారు రేట్ల ఓపెనింగ్స్ రాబట్టింది. 

ఇప్పటికే అన్ని ఏరియాల్లో శని ఆదివారాల్లో కూడా ఈ సినిమా ప్రీ బుకింగ్ బాగుంది. ఇక ఈ సినిమాతో పాటు విడుదలైన దొరసాని, రాజ్ దూత్ సినిమాలలో దొరసాని యావరేజ్ టాక్ తోనూ.. రాజ్ దూత్ నెగెటివ్ టాక్ పడడం కూడా సందీప్ కిషన్ నిను వీడ‌ని నీడ‌ను నేనేకి బాగా కలిసొచ్చింది. మరి ఐదారు సినిమాల ప్లాప్‌తో ఉన్న సందీప్ ఇప్పుడు ఈ నిను వీడ‌ని నీడ‌ను నేనే సక్సెస్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాని సందీప్ చాలా కమిట్మెంట్ తో చేశాడని.. గత సినిమాల ప్లాప్స్ ని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా విషయంలో ఛాన్స్ తీసుకోకుండా.. రీషూట్ కూడా చేయించాడు అని చెబుతుంది మూవీ టీం. ఆ టైం లో మెయిన్ నిర్మాత ఖర్చుపెట్టలేనంటే నిర్మాతగా కూడా మారాడు. తాను అనుకున్న విధంగా సినిమా వచ్చే వరకూ తానే ఖర్చు పెట్టాడు. మరి సందీప్ పడిన శ్రమ ఈ సినిమా హిట్‌తో పరిపూర్ణమైందనే చెప్పాలి.

Sundeep Kishan Happy with Ninu Veedani Needanu Nene Movie Success:

Ninu Veedani Needanu Nene gets Hit Talk at Box Office

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ