Advertisementt

‘మిస్ట‌ర్ KK’ ప్రీ రిలీజ్ ఎప్పుడంటే..?

Mon 15th Jul 2019 04:57 AM
mister kk movie,pre release,event,july 16  ‘మిస్ట‌ర్ KK’ ప్రీ రిలీజ్ ఎప్పుడంటే..?
Mister KK Pre Release Event details ‘మిస్ట‌ర్ KK’ ప్రీ రిలీజ్ ఎప్పుడంటే..?
Advertisement
Ads by CJ

జూలై 16 న పారిజాత‌ మూవీ క్రియేష‌న్స్, చియాన్ విక్ర‌మ్ మాసివ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ‘మిస్ట‌ర్ కెకె’ ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌

శివ‌పుత్రుడు, అప‌రిచితుడు చిత్రాల‌తో తెలుగులో స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న చియాన్ విక్ర‌మ్ క‌థానాయ‌కుడిగా అక్ష‌ర‌ హాస‌న్‌, అభిహాస‌న్ కీల‌క పాత్ర‌ల్లో రాజేష్ ఎం సెల్వ ద‌ర్శ‌క‌త్వంలో రూపోందిస్తున్న మిస్ట‌ర్ కెకె. ఇటీవ‌లే కిల్ల‌ర్ లాంటి సూప‌ర్‌హిట్ చిత్రంతో  తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకున్న పారిజాత మూవీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై ఈ  చిత్రాన్ని తెలుగులో నిర్మాత‌లు టి.న‌రేష్ కుమార్‌, టి. శ్రీధ‌ర్ లు సంయుక్తంగా టి.అంజ‌య్య స‌మ‌ర్ప‌ణలో జూలై 19న అత్యధిక థియేటర్స్ లో విడుద‌ల చేస్తున్నారు. ఈ చిత్రం యొక్క ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ ని జూలై 16 న గ్రాండ్ గా హైద‌రాబాద్ లో చేస్తున్నారు. 

ఈ సంద‌ర్బంగా నిర్మాత‌లు టి.న‌రేష్ కుమార్ అండ్ టి శ్రీధ‌ర్ లు మాట్లాడుతూ..  ఇటీవ‌లే కిల్ల‌ర్ లాంటి సూప‌ర్‌డూప‌ర్ హిట్ చిత్రాన్ని అందించిన మా బ్యాన‌ర్ పారిజాత మూవీ క్రియేష‌న్స్ లో  మ‌రో  సెన్సేషనల్ ఫిల్మ్ మిస్ట‌ర్ కెకె జూలై 19 న‌ విడుదల చేస్తున్నాము. మంచి చిత్రాలు చేయాల‌నే మా ప్ర‌య‌త్నానికి తెలుగు ప్రేక్ష‌కుల ఆశీస్సులు బ‌లంగా వున్నాయి.   ఇటీవ‌ల విడుద‌ల చేసిన‌ ట్రైల‌ర్ లో విక్ర‌మ్ గెట‌ప్ గాని ఆయ‌న లుక్ చింపేసింద‌ని అంద‌రూ ఒకే మాట చెబుతున్నారు. అలాగే విజువ‌ల్ గ్రాండియ‌ర్ గా క‌నిపించిన ఈ చిత్రం గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే ట్రైల‌ర్ లోనే క‌నిపించ‌టం విశేషం. అలాగే అక్ష‌ర హాస‌న్ కూడా పెర్‌ఫార్మెన్స్ స్కోప్ వున్న పాత్రలో క‌నిపించింది. రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ సాహో లాంటి చిత్రం తరువాత జిబ్రాన్ మిస్ట‌ర్ కెకె కి మ్యూజిక్ ని ఇవ్వ‌టం ఈ సినిమా రేంజ్ ని డ‌బుల్ చేసింది. ట్రైల‌ర్ లో విక్ర‌మ్ చెప్పిన డైలాగ్ ని సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా ట్రోల్ చేయ‌టం ఈ చిత్రంపై ప్రేక్ష‌కుల‌కి వున్న క్రేజ్ ని తెలియ‌జేస్తుంది. నువ్వు ఆడుతున్న‌ది నాతో కాదు యముడితో అనే డైలాగ్ కి మాసివ్ రెస్పాన్స్ వ‌చ్చింది. ట్రైల‌ర్‌తో అంచ‌నాలూ మొద‌ల‌య్యాయి. ఈ చిత్రం యొక్క ప్రీరిలీజ్ ఫంక్ష‌న్ జూలై 16న గ్రాండ్ గా హైద‌రాబాద్ లో చేయ‌బోతున్నాము.. అని అన్నారు.

న‌టీన‌టులు.. విక్ర‌మ్‌, అక్ష‌ర హాస‌న్‌, అభి హాస‌న్ త‌దిత‌రులు

పారిజాత మూవీ క్రియేష‌న్స్

మ్యూజిక్‌.. జిబ్రాన్‌

పి ఆర్ ఓ.. ఏలూరు శ్రీను

స‌మ‌ర్స‌ణ‌.. టి.అంజ‌య్య‌

నిర్మాత‌లు... టి.న‌రేష్ కుమార్ అండ్ టి. శ్రీధ‌ర్‌

ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం .. రాజేష్ ఎం సెల్వ‌

Mister KK Pre Release Event details:

Mister KK Movie Pre Release Event on July 16

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ