బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. పెళ్లికి ముందు ఆ తర్వాత అని మాత్రమే చెప్పగలం. ఇక మధ్య మధ్యలో కొన్ని కొన్ని కాంట్రవర్సీలు వచ్చినప్పటికీ అవన్నీ ఆమె పాపులారిటీని పెంచాయే తప్ప.. తగ్గించిందేమీ లేదు.. ఆమె ఈమేజ్కు ఏ మాత్రం డ్యామేజీ కాలేదు కూడా. అయితే పెళ్లయిన తర్వాత మాత్రం సోషల్ మీడియాలో ప్రియాంక.. సినీ ప్రియులు, నెటిజన్లు, అభిమానులకు తన హాట్ హాట్ ఫొటోలతో ప్రియాంక కాకపుట్టిస్తోంది!
అదేదో సాంగ్ ఉంది కదా.. కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ అన్నట్లు హాట్ ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోవడమే ప్రియాంకకు ప్లస్ అయ్యింది. అదెలాగంటే అలా ఫొటోలు పోస్ట్ చేయడం వల్లే ప్రియాంక నంబర్ వన్ స్థాన్ని దక్కించుకుంది. ప్రియాంక-నిక్ ఇద్దరూ కలిసి ఇటీవల వెకేషన్ ఎంజాయ్ చేశారు. ఈ సందర్భంగా చోప్రా స్విమ్ సూట్లో హాట్ హాట్ లుక్లతో ఫోటోలకు పోజిచ్చింది. అయితే ఈ ఫోటోలను స్వయానా భర్తే క్లిక్ మనిపించాడు.
ఇప్పుడీ హాట్ ఫొటోలే ప్రియాంకను నంబర్ వన్ స్థానంలో కూర్చోబెట్టాయి. అదెలాగంటే.. ప్రముఖ అమెరికన్ మ్యాగజైన్ విడుదల చేసే ‘గ్లోబల్ మీడియా క్లైంబర్స్ చార్ట్’లో ప్రియాంకా నంబర్ వన్ స్థానంను దక్కించుకుంది. కాగా.. ఈ హాట్ ఫొటో షూట్‌కు ముందు ఈ మ్యాగజైన్ జాబితాలో ప్రియాంక ఆరోస్థానంలో ఉంది. అయితే ఇలా నంబర్ వన్ స్థానంలో ఈ ముద్దుగుమ్మ నిలవడం ఇది 12వ సారి కావడం విశేషమని చెప్పుకోవచ్చు. ఈ సందర్భంగా ప్రియాంక మాట్లాడుతూ.. నిక్ జోనాస్ తీసిన ఈ ఫోటో తనకి అన్నింట్లోనూ ప్రత్యేకమని చెప్పుకొచ్చింది.