Advertisementt

స్మిత 20 ఏళ్ల సంగీత ప్రయాణం

Thu 18th Jul 2019 02:27 AM
singer smitha,20 years,musical journey,letter  స్మిత 20 ఏళ్ల సంగీత ప్రయాణం
Singer Smitha 20 Years Musical Journey స్మిత 20 ఏళ్ల సంగీత ప్రయాణం
Advertisement
Ads by CJ

20 ఏళ్ల ఓ సంగీత ప్ర‌యాణం.. 

నాకు ఇంకా నిన్న‌టి మాదిరే అనిపిస్తుంది. అస‌లే మాత్రం అంచ‌నాలు లేకుండా.. ఏం జ‌రుగుతుందో ఇక్క‌డ ఎలా ఉంటుందో తెలియ‌కుండానే వ‌చ్చాను. అక్క‌డ్నుంచే నేర్చుకోవ‌డం మొద‌లు పెట్టాను. మ్యూజిక్, డాన్స్ లో మ‌రింత శోధ‌న చేసి ఎదిగాను. ఇప్పుడు 20 ఏళ్లైపోయింది. ఇప్పుడు ఒక్క‌సారి వెన‌క్కి తిరిగి చూసుకుంటే నా ఈ ప్ర‌యాణం ఎంతో ఆనందంగా ఉంది. ప్ర‌తీ చిన్న విష‌యాన్ని కూడా నేను ఎంజాయ్ చేసాను. ప్ర‌తీ క్ష‌ణం ఓ కొత్త ఆరంభం మాదిరే అనిపించింది నాకు. 

1996లో మొద‌ట నేను పాడుతా తీయ‌గాలో తొలిసారి మైక్ ప‌ట్టుకున్న క్ష‌ణం నుంచి నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు కూడా అదే ఉత్సాహం.. ఎంజాయ్ మెంట్ నాలో ఉన్నాయి. ఇప్ప‌టికీ ప్ర‌తీ చిన్న విష‌యానికి కూడా ఎగ్జైట్ మెంట్ క‌నిపిస్తుంది నాలో. తెలుగు రాష్ట్రాల్లో ఒకే ఒక్క ఇండిపాప్ నేనే అయినందుకు చాలా గ‌ర్వంగా అనిపిస్తుంది. 10 కంటే ఎక్కువ భాష‌ల్లో పాడ‌టం కూడా నాకు గొప్ప అనుభ‌వం. వీట‌న్నింటితో పాటు 12 ఆల్బ‌మ్స్, 17 మ్యూజిక‌ల్ వీడియోలు, 100కు పైగా ప్లే బ్యాక్స్, 8 దేశాల్లో 200కు పైగా కాన్స‌ర్ట్స్.. ఓ ట్రోఫీ ఇంటికి తీసుకురావ‌డం ఇవ‌న్నీ జీవితంలో ఎప్ప‌టికీ మ‌రిచిపోలేని తీపి అనుభూతులే. 

జూలై 22న నా ఈ మ్యూజిక్ అండ్ డాన్స్ జ‌ర్నీకి సంబంధించిన ఓ సెల‌బ్రేష‌న్ ఉంది. ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉండ‌టానికి కార‌ణం అయిన ప్ర‌తీ ఒక్క‌ర్ని అందులో నేను గుర్తు చేసుకోవాల‌నుకుంటున్నాను. నా ప్ర‌యాణం క్యాసెట్ నుంచి సీడి, సీడి నుంచి పెన్ డ్రైవ్స్, పెన్ డ్రైవ్స్ నుంచి డిజిట‌ల్ వ్యూస్ ఇలా ఎన్నో మారిపోయాయి. నా పాట‌లు వంద‌ల మిలియ‌న్స్ డిజిట‌ల్ వ్యూస్ దాటిపోయి ఎన్నో కోట్ల మంది హృద‌యాల‌ను గెలుచుకున్నాయి. ఈ ప్ర‌యాణంలో అదెంతో మ‌ధురానుభూతి నాకు. 

నాకు ఇంత సాధించ‌డానికి ఎంతో చేసిన వాళ్లంద‌ర్నీ గుర్తు చేసుకోవడానికి.. వాళ్ల‌కు మ‌న‌సారా కృత‌జ్ఞ‌త‌లు చెప్పుకోవడానికి ఏర్పాటు చేసుకున్నాను. క‌ళ‌కు నేను ఇవ్వాల‌నుకుంటున్న గౌర‌వం ఇది.  నా ముందున్న ల‌క్ష్యాల‌ను కూడా మీ ముందు ఉంచ‌బోతున్నాను. 

జూలై 22 సాయంత్రం 7 గంట‌ల నుంచి హైద‌రాబాద్ JRC క‌న్వెన్ష‌న్ హాల్ లో ఈ వేడుక‌ను ఎంజాయ్ చేద్దాం.. 

ప్రేమ‌తో 

స్మిత

Singer Smitha 20 Years Musical Journey:

Smitha 20 Years Musical Journey Letter  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ