ప్రస్తుతం అక్కినేని సమంత సక్సెస్ ఫుల్ హీరోయిన్. ఈమెకు సక్సెస్ రేషియో ఎక్కువ. అయితే సక్సెస్ లు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఈమెకు ఎక్కువ రెమ్యూనరేషన్ ఇస్తారు అనుకుంటే అది పొరపాటే. ఆమె ప్రస్తుతం చేస్తున్న లేడీ ఓరియంటెడ్ సినిమాలకి అయినా సాధారణంగా ఎంత ఇస్తారో అంతే ఇస్తారు.
లేడీ ఓరియంటెడ్ మూవీస్ కి సామ్ కి నాన్ థియేట్రికల్ హక్కులు కలుపుకుని పాతిక నుంచి ముప్పయ్ కోట్ల వరకు బిజినెస్ చేస్తున్నాయి. ఈ విషయం సామ్ కి తెలుసు. కానీ ఆమెకు రెమ్యూనరేషన్ వచ్చేది మాత్రం కోటిన్నర లోపే. అందుకే ఆమె ఇదంతా అర్ధం చేసుకుని సొంత నిర్మాణ సంస్థ వైపు ఆలోచిస్తుంది.
తన సినిమాలు అండ్ చైతు సినిమాలు అన్ని కలిపి తమ సొంత బ్యానర్ లో నిర్మించుకోవాలని అనుకుంటుంది సామ్. నాగ చైతన్యకి అన్నపూర్ణ స్టూడియోస్‌లో భాగస్వామ్యం వున్నా కానీ దాంతో సంబంధం లేకుండా తమ సినిమాలు తామే నిర్మించుకోవాలని సామ్ నిర్ణయించుకుంది. తన సినిమాలు చైతు సినిమాలు తమ బ్యానర్ లో నిర్మిస్తే మామూలుగా వచ్చే దానికంటే ఎక్కువ పారితోషికం వస్తుందని సమంత భావిస్తోంది. మరి దీనికి నాగ్ ఒప్పుకుంటాడో లేదో చూడాలి. కానీ సామ్ కొత్త నిర్మాణ సంస్థ గురించి ప్లాన్స్ కూడా రెడీ చేస్తుంది.