Advertisementt

కంగారుపడ్డ విజయ్.. నిర్వాహకులపై ఆగ్రహం!

Thu 18th Jul 2019 08:35 PM
dear comrade music festival,lady fan,vijay devarakonda  కంగారుపడ్డ విజయ్.. నిర్వాహకులపై ఆగ్రహం!
Lady Fan Gets Emotional After Seeing Vijay Devarakonda కంగారుపడ్డ విజయ్.. నిర్వాహకులపై ఆగ్రహం!
Advertisement
Ads by CJ

టాలీవుడ్ కుర్ర హీరో విజయ్ దేవరకొండ అలియాస్ రౌడీ హీరోగా పేరుగాంచిన ఈయనకు తెలుగు రాష్ట్రాల్లో ఏ రేంజ్‌లో అభిమానులున్నారో కొత్తగా చెప్పనక్కర్లేదు. ఇంతమంది ఈయనకు అభిమానులుగా మారడానికి కారణాలు చాలానే ఉన్నాయి. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాల్లో రాణించడం చాలా కష్టమే. అయితే అలాంటి వన్నీ నిలదొక్కుకుని తన సత్తా ఏంటో చాటి చూపించాడు విజయ్.

కాగా.. విజయ్ దేవరకొండ తాజా చిత్రం ‘డియర్ కామ్రేడ్’. త్వరలో ఈ సినిమా అభిమానుల ముందుకు రానుండటంతో మ్యూజికల్ ఫెస్టివల్ పేరుతో బెంగళూరు, కొచ్చి, చెన్నై, హైదరాబాద్ ఇలా అన్ని ప్రాంతాలకు రౌడీ హీరో వచ్చి ప్రమోషన్స్‌ చేసేసుకుంటున్నాడు. అయితే తాజాగా ఆయన ఎక్కడ ఏ ఈవెంట్‌కు వెళ్లాడో తెలియదు కానీ.. ఈవెంట్ నిర్వాహకులు కూడా ఊహించని.. పోలీసులు కూడా కంట్రోల్ చేయలేనంత మంది ఫ్యాన్స్ ఒక్కసారిగా వచ్చేశారు.

దీంతో ఈ ఫ్లోటింగ్‌ను కంట్రోల్ చేయలేకపోయిన పోలీసులు లాఠీలకు బుద్ధి చెప్పారు. ఈ క్రమంలో పలువురు అభిమానులకు గాయాలయ్యాయి. లాఠీ దెబ్బతో ఓ యంగ్ లేడీ ఫ్యాన్ తీవ్రంగా గాయపడటంతో ఆమెను దగ్గరకి తీసుకున్న విజయ్.. ఓదారుస్తూ దేవరకొండ కూడా ఒకింత కంగారుపడ్డాడు. ఈ సన్నివేశాలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. అందుకే ఇక ముందు చెన్నై, హైదరాబాద్ ఈవెంట్ల విషయంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్త పడాలని నిర్వాహకులపై విజయ్ కన్నెర్రజేశారట.

Lady Fan Gets Emotional After Seeing Vijay Devarakonda :

Lady Fan Gets Emotional After Seeing Vijay Devarakonda 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ