Advertisementt

టాలీవుడ్‌లో కాపీ రచ్చ మళ్లీ మొదలు..!

Fri 19th Jul 2019 03:45 PM
puri jagannadh,ismart shankar,ram,copy allegations,story  టాలీవుడ్‌లో కాపీ రచ్చ మళ్లీ మొదలు..!
Copy Allegations on Puri Ismart Shankar టాలీవుడ్‌లో కాపీ రచ్చ మళ్లీ మొదలు..!
Advertisement
Ads by CJ

మళ్లీ తెరపైకి కాపీ క్యాట్ చర్చ నడుస్తుంది. ఈ శుక్రవారం రిలీజ్ అయినా ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రం ఓ హాలీవుడ్ నుండి కాపీ కొట్టిందని వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై తాజాగా రామ్ అండ్ పూరిలు స్పందించారు. కేవలం మెమరీ చిప్ అన్న పాయింట్ ని హాలీవుడ్ లో ఓ మూవీ నుండి ఇన్స్పైర్ అయ్యి తీసుకున్నాం అంతే కానీ సినిమా మొత్తం కాపీ కొట్టలేదని... స్టోరీ మొత్తం ఓన్ గా రాసుకున్నారని చెబుతున్నారు.

అయితే ఇంతటితో కాపీ గొడవ ఆగలేదు. మరో సినిమా విషయంలో కూడా ఈ చర్చ నడుస్తుంది. ఆగస్టు 15న రిలీజ్ కి వస్తున్న అడివి శేష్ ‘ఎవరు?’ చిత్రంపైనా కాపీ క్యాట్ వివాదం తాజాగా చర్చకు వచ్చింది. ఇదొక స్పానిష్ మూవీ ‘ది ఇన్ విజిబుల్ గెస్ట్’ ఆధారంగా తెరకెక్కించారని ప్రచారమవుతోంది. మరి ఇది అధికారంగా రైట్స్ తీసుకుని రీమేక్ చేస్తున్నారా? లేదా కాపీ చేస్తున్నారో తెలియాల్సిఉంది. ఇది హారర్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతున్న చిత్రం. దీన్ని డెబ్యూ వెంకట్ రాంజీ దర్శకత్వం వహించారు. పీవీపీ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హీరోయిన్ గా రెజీనా నటించనుంది. రేపు ఈసినిమా యొక్క టీజర్ ను రిలీజ్ చేయనున్నారు.

ఇది ఇలా ఉండగా స్పానిష్ మూవీ ది ఇన్ విజిబుల్ గెస్ట్ స్ఫూర్తితో ఇప్పటికే పలు భాషల్లో సినిమాలొచ్చాయి. బాలీవుడ్ లో ‘బద్లా’ అనే పేరుతో వచ్చింది. ఇందులో తాప్సీ-అమితాబ్ నటించారు. అక్కడ ఈమూవీ బాగానే ఆడింది. క్రిటిక్స్ ప్రశంసలు అందుకుంది. ఇలా మన డైరెక్టర్స్ ఏదొక విషయంలో కాపీ కొడుతూనే ఉన్నారు. కాపీ కొట్టారు కదా అని అడిగితే లేదు ఇన్స్పైర్ అయ్యి తీసాం అంటున్నారు.

Copy Allegations on Puri Ismart Shankar:

Puri Jagannadh Ismart Shankar in Troubles

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ