Advertisementt

ఇప్పుడు మహేష్ ఓకే అన్నా.. నేను చేయాలిగా: పూరి

Sat 20th Jul 2019 08:40 PM
puri jagannadh,mahesh babu,janaganamana,counter  ఇప్పుడు మహేష్ ఓకే అన్నా.. నేను చేయాలిగా: పూరి
Puri Jagannadh sensational Comments on Mahesh Babu ఇప్పుడు మహేష్ ఓకే అన్నా.. నేను చేయాలిగా: పూరి
Advertisement
Ads by CJ

పోకిరి, బిజినెస్ మ్యాన్ మహేష్ కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రాలు. పూరి దర్శకత్వంలో మహేష్‌ని స్టార్ హీరో ఇమేజ్ కి దగ్గర చేసిన చిత్రాలవి. అలాంటి పూరి దర్శకత్వంలో మహేష్ బాబు జనగణమన సినిమా చేయబోతున్నాడనే న్యూస్ గత ఐదారేళ్లలో ప్రచారం జరిగింది. కానీ పూరి వరస ప్లాప్స్ లో సతమతమవడం వలన అతనితో మహేష్ సినిమా చెయ్యడానికి వెనకాడాడు. మహేష్ ని దృష్టిలో పెట్టుకుని పవర్ ఫుల్ జనగణమన స్క్రిప్ట్ రాసుకుని మహేష్ చుట్టూ తిరిగిన పూరికి మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా చుక్కలు చూపించాడు. ఎలాగైనా జనగణమన కథని మహేష్ తోనే చేయాలని పూరి డిసైడ్ అయ్యాడు. కానీ కుదరలేదు.

అయితే గత కొన్నాళ్లుగా ప్లాప్స్‌లో ఉన్న పూరి జగన్నాధ్ తాజాగా రామ్ హీరోగా తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ సినిమా హిట్ టాక్ తో థియేటర్స్ లో రన్ అవుతుంది. అయితే ఇస్మార్ట్ ఇంటర్వూస్ లో భాగంగా పూరి జగన్నాధ్, మహేష్ బాబు తో చెయ్యాల్సిన జనగణమన ప్రస్తావనవచ్చింది. అయితే పూరి పోకిరి, బిజినెస్ మ్యాన్ చేసిన మహేష్ కన్నాఎక్కువగా ఆయన అభిమానులంటే తనకిష్టమని చెప్పడమే కాదు.... మహేష్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేసాడు. మహేష్ బాబు హిట్స్ ఉంటేనే నాతో సినిమా చేస్తాడని సంచలనంగా మాట్లాడాడు. మరి ఇస్మార్ట్ తో హిట్ కొట్టిన మీకు మహేష్ పిలిచి జనగణమన చెయ్యమని అడిగితే అంటూ సదరు యాంకర్ ప్రశ్నించగా.... మహేష్ కి ఒకే చెప్పడానికి నాకు ఓ కేరెక్టర్ ఉంటుంది అంటూ మహేష్ పై తన అక్కసుని వెళ్లగక్కాడు.

Puri Jagannadh sensational Comments on Mahesh Babu:

Puri Jagan Counter on Super Star Mahesh Babu

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ