Advertisementt

జబర్దస్త్ వినోదినిపై హత్యాయత్నం!

Sat 20th Jul 2019 10:01 PM
house owner,attack,jabardasth,vinodini  జబర్దస్త్ వినోదినిపై హత్యాయత్నం!
house owner attack on jabardasth vinodini జబర్దస్త్ వినోదినిపై హత్యాయత్నం!
Advertisement
Ads by CJ

‘జబర్దస్త్’ టీవో షో ఆర్టిస్ట్ వినోద్‌ అలియాస్ వినోదినిపై దాడి జరిగింది. వినోద్ ఉంటున్న ఇంటి ఓనర్ జరిపిన దాడిలో వినోద్ తీవ్రంగా గాయపడ్డాడు. అయితే ఓనర్‌- వినోద్ మధ్య ఏం జరిగిందో ఏమో తెలియరాలేదు. ఓనర్ చేసిన దాడిలో వినోద్ కుడి కంటి భాగంపై బాగా దెబ్బలు తగిలాయని ఫొటోలను బట్టి చూస్తే అర్థమవుతోంది. 

ఈ ఘటనకు పాల్పడిన తన ఇంటి ఓనర్‌ను కఠినంగా శిక్షించాలని కాచిగూడ పోలీస్ స్టేషన్‌లో వినోద్ ఫిర్యాదు చేశాడు. వినోదిని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు ఇంటి ఓనర్‌ను స్టేషన్‌కు పిలిపించుకుని విచారిస్తుస్తున్నట్లు సమాచారం.

అయితే ఈ గొడవ ఎందుకు జరిగింది..? ఓనర్ ఎందుకు చేయిచేసుకున్నారు..? ఏ విషయంలో వీరిద్దరి మధ్య గొడవ జరిగింది..? అసలు ఈ గొడవకు కారకులెవరు..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. దాడిలో తీవ్రంగా గాయపడ్డ వినోద్‌ను చికిత్స నిమిత్తం స్థానికంగా ఉన్న ఓ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న వినోద్ కుటుంబ సభ్యులు, అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

house owner attack on jabardasth vinodini:

house owner attack on jabardasth vinodini

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ