థ్రిల్లర్ ... ఈ జోనర్ అంటే ఇష్టపడని వారుండరు. ఇప్పటివరకు మంచి కంటెంట్ తో వచ్చిన థ్రిల్లర్ మూవీస్ అన్ని విజయం సాధించడమే దీనికి ఉదాహరణ...ఇటీవలి కాలంలో ఈ జోనర్ కి విపరీతమైన ప్రేక్షకాదరణ ఉంది. ప్రస్తుతం థ్రిల్లర్ సినిమాల ట్రెండ్ నడుస్తోన్న క్రమంలో.. ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్ మీద చూడని ఒక సరికొత్త కాన్సెప్ట్ తో ఓ.యస్.యం విజన్ - దివ్యాషిక క్రియేషన్స్ పతాకాలపై సుక్రి కుమార్ నిర్మిస్తున్న సైకలాజికల్ థ్రిల్లర్ ‘నేను లేను’... ‘లాస్ట్ ఇన్ లవ్’ అనేది ఉపశీర్షిక.. హర్షిత్, వంశీకృష్ణ పాండ్య, శ్రీపద్మ, మాధవి, బిశ్వజిత్‌నాధ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి రామ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా పోస్టర్ నుండి ప్రతిదీ ఒక సంచలనమే... ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్రం ట్రైలర్ ను దాదాపు కోటి ముప్పై లక్షల మంది వీక్షించారు అంటేనే తెలుస్తోంది ఆడియన్స్ఈ సినిమా కోసం ఎంతలా ఎదురుచూస్తున్నారని... ఈ చిత్రం ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని యుబైఎ సర్టిఫికేట్ పొందింది. సినిమా చూసి సెన్సార్ వారు అభినందించడం గమనార్హం. ఆడియన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ చిత్రం జులై 26 న అత్యధిక థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సందర్భంగా
చిత్ర దర్శకుడు రామ్ కుమార్ మాట్లాడుతూ - ‘‘ఒక అందమైన ప్రేమకథతో తెరకెక్కిన సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రమిది. ఇందులోని థ్రిల్లర్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఆధ్యంతం ఉత్కంఠకు గురి చేస్తాయి. ఈ సినిమాలో న్యూ ఏజ్ లవ్ స్టోరీ ఆడియన్స్ కి ఫ్రెష్ ఫీల్ ఇస్తుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ లాగే సినిమా కూడా అన్ని వర్గాల వారిని తప్పకుండా ఆకట్టుకుంటుంది. టెక్నికల్ గా సినిమా హై ఎండ్ లో ఉంటుంది. నాకు సపోర్ట్ చేసి సినిమా ఇంత బాగా రావడానికి కారణమైన మా నిర్మాత సుక్రి కుమార్ గారికి స్పెషల్ థాంక్స్. అలాగే సినిమాలో పని చేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్లు అందరకీ ధన్యవాదాలు. జూలై 26 న అందరూ థియేటర్ లో సినిమా చూడండి’’ అన్నారు.
నిర్మాత సుక్రి కుమార్ మాట్లాడుతూ... ఇండియన్ సినిమా స్క్రీన్ పై ఇప్పటివరకు రానీ, చూడని సరికొత్త కాన్సెప్ట్ తో వస్తున్న చిత్రం ‘నేను లేను’. ఇటీవల మా సినిమాకు సెన్సార్ కార్యక్రమాలు పూర్తయి యుబైఎ సర్టిఫికేట్ లభించింది. సెన్సార్ వారు మంచి సినిమా తీశారు అని మా యూనిట్ అందరిని అభినందించారు. ఇప్పటివరకు కోటి ముప్పై లక్షల మంది ఈ ట్రైలర్ ని చూశారంటే మా సినిమా ప్రేక్షకులను తప్పకుండా మెప్పిస్తుందనే కాన్ఫిడెంట్ ఉంది. ఇంత మంచి సినిమాలో భాగం అయినందుకు సంతోషంగా ఉంది. జూలై 26 న ఈ సినిమాని అత్యంత గ్రాండ్ గా విడుదల చేస్తున్నాం. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది’’ అన్నారు.
హర్షిత్, వంశీకృష్ణ పాండ్య, శ్రీపద్మ, మాధవి, బిశ్వజిత్‌నాధ్, రుద్రప్రకాశ్, వేల్పుల సూరి, యుగంధర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి
సంగీతం: ఆశ్రిత్, ఛాయాగ్రహణం: ఎ. శ్రీకాంత్ (బి.ఎఫ్.ఎ), నృత్యాలు: జోజో, నిర్వాహణ: సురేష్‌కూరపాటి, పి.ఆర్.ఓ: సాయి సతీష్ పాలకుర్తి, విఎఫ్ఎక్స్: ప్రభురాజ్, ఎస్.ఎఫ్.ఎక్స్: పురుషోత్తం రాజు, ఆడియోగ్రఫీ: రంగరాజ్, కలరిస్ట్: కళ్యాణ్ ఉప్పాలపాటి, ప్రచార చిత్రాలు: శ్రీక, సహాయదర్శకులు: జె.మోహన్‌కాంత్, దర్మేంద్ర, సురేశ్, సహనిర్మాత: యషిక, నిర్మాత: సుక్రి , రచన- దర్శకత్వం: రామ్ కుమార్ ఎమ్.ఎస్.కె.