ప్రస్తుతం టాలీవుడ్‌లో పూజా హెగ్డే పిచ్చ క్రేజ్ ఉన్న హీరోయిన్. అందుకే స్టార్ హీరోస్ అంతా ఆమె వెంటే పడుతున్నారు. ఎన్టీఆర్ దగ్గరనుండి ప్రభాస్ వరకు, మహేష్ దగ్గరనుండి అల్లు అర్జున్ వరకు పూజా తోనే సినిమాలు చేస్తున్నారు. అసలు ఒక్క బ్లాక్ బస్టర్ కూడా లేని పూజా తన గ్లామర్ తోనే స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ లు కొట్టేస్తూ వచ్చింది. నటనలో కాస్త వీక్ అయినా.. గ్లామర్ ముందు అది కూడా బలాదూర్ అన్నట్లుగా ఉంది. ఇక ప్రస్తుతం పూజా లాగానే మరో హీరోయిన్ కూడా స్టార్ హీరోయిన్ రేంజ్ కి చేరడం ఖాయంగా కనబడుతుంది. ‘ఛలో’తో హిట్ కొట్టి... గీత గోవిందంతో సూపర్ హిట్ కొట్టిన రష్మిక దేవదాస్‌తో ప్లాప్ చూసినా.... మళ్లీ గీత గోవిందంతో హిట్ ఫెయిర్ అనిపించుకున్న విజయ్ దేవరకొండతో డియర్ కామ్రేడ్ సినిమాలో నటిస్తుంది. వచ్చే శుక్రవారం విడుదలకాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.
డియర్ కామ్రేడ్ గనక హిట్ అయ్యిందా రష్మిక రేంజ్ మారిపోవడం ఖాయం. ఇప్పటికే మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటిస్తున్న రష్మికకు డియర్ కామ్రేడ్ కూడా హిట్ అయితే.. ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి హీరోల చూపు ఆమె మీద పాడడం ఖాయం. పెద్దగా గ్లామర్ లేకపోయినా.. అందం అంతంత మాత్రం అయినా.. నటనలో, అమాయకత్వంతో, లిప్ లాక్ అండ్ రొమాంటిక్ సన్నివేశాలకు అడ్డు చెప్పని ఈ భామని ఎవ్వరు వదులుతారు. డియర్ కామ్రేడ్ సినిమాలో విజయ్ దేవరకొండతో లిప్ లాక్ సన్నివేశాలతో రెచ్చిపోయిన రష్మిక ప్రమోషన్స్ తోను హడావిడి చేస్తుంది. డియర్ కామ్రేడ్ మ్యూజిక్ ఫెస్టివల్‌లో విజయ్‌తో కలిసి లైవ్ డాన్స్ చేస్తూ అదరగొట్టేస్తున్న ఈ పాప త్వలోనే పూజా రేంజ్‌కి చేరడం ఖాయం.