దర్శకధీరుడు రాజమౌళి ఎంతో గ్రాండ్ లెవెల్ లో తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్’. ఈచిత్రంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు నటిస్తున్నారు. రామ్ సరసన అలియా భట్ నటిస్తుంది. ఇక ఎన్టీఆర్ సరసన మొదట హాలీవుడ్ అమ్మాయి డెయిసీ ఎడ్గార్ జోన్స్‌ని అనుకుని అనౌన్స్ కూడా చేసారు. కానీ ఆమె ఎందుకో ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు.
అప్పటి నుండి మరో హీరోయిన్ కోసం RRR మేకర్స్ అన్వేషిస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ సరసన చేసే హీరోయిన్ పాత్ర చిన్నది అయినప్పటికీ హాలీవుడ్ నుండి తీసుకుని రావాలని రాజమౌళి పట్టుబట్టాడట. రీసెంట్ గా హాలీవుడ్ నుండి ఎమ్మా రాబర్ట్స్ అనే హీరోయిన్ నుండి గ్రీన్ సిగ్నల్ లభించినట్టు తెలిసింది.
ఆమె గతంలో వైల్డ్ ఛైల్డ్, నెర్వ్ తదితర చిత్రాల్లో నటించింది. ఈమె పెద్దగా ఎవరికి తెలియకపోవచ్చు కానీ రాజమౌళి రాసుకున్న పాత్రకి ఆమె కరెక్ట్ అని ఆమెను తీసుకోనున్నారు. స్క్రీన్ టెస్ట్ జరిగిన తరువాత అధికారంగా ప్రకటించే అవకాశముంది.