Advertisementt

అనసూయ ‘కథనం’తో వచ్చేస్తుంది

Wed 24th Jul 2019 01:52 PM
anasuya,kathanam movie,release,aug 09  అనసూయ ‘కథనం’తో వచ్చేస్తుంది
Anasuya Kathanam Movie Release Date Fixed అనసూయ ‘కథనం’తో వచ్చేస్తుంది
Advertisement
Ads by CJ

అనసూయ ప్రధాన పాత్రలో రాజేష్‌ నాదెండ్ల ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కథనం’. ది గాయ‌త్రి ఫిల్మ్స్ , ది మంత్ర ఎంట‌ర్‌టైన్మెంట్స్‌, పతాకాలపై  బి.న‌రేంద్ర‌రెడ్డి, శ‌ర్మ‌చుక్కా సంయుక్తంగా  నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రోషన్ సాలూరి సంగీతం సమకూరుస్తుండగా, స‌తీష్ ముత్యాల‌ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు.  అవ‌స‌రాల శ్రీ‌నివాస్‌, ర‌ణ‌ధీర్‌, ధ‌న్‌రాజ్‌, వెన్నెల‌కిషోర్‌, పెళ్లి పృధ్వీలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్ట్ లో విడుదలకు సిద్దమవుతోంది.

ఈ సందర్భంగా చిత్ర విశేషాల గురించి నిర్మాత న‌రేంద్ర రెడ్డి మాట్లాడుతూ... అన‌సూయ‌గారు ఫుల్ లెంగ్త్ రోల్ చేసిన చిత్రమిది. ఆవిడ కెరీర్ లో ఇదొక  బ్లాక్ బ‌స్ట‌ర్ అవుతుంద‌ని  న‌మ్మ‌కం ఉంది. సెన్సార్ పూర్తయింది. యు/ఎ సర్టిఫికేట్ లభించింది. సెన్సార్ సభ్యుల ప్రశంసలు లభించాయి. ఆగస్ట్ 9 న సినిమా విడుదల చేస్తామన్నారు. 

దర్శకుడు రాజేష్ నాదెండ్ల మాట్లాడుతూ... ఇది నా మొద‌టి చిత్రం. క్ష‌ణం, రంగ‌స్థ‌లం తర్వాత ఆమె చేస్తున్న ఈ క‌థ‌నం సినిమాతో హ్యాట్రిక్ కొట్ట‌బోతున్నారు అన‌సూయ‌గారు. తప్పకుండ ఆమె తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తుంది.  న‌రేంద్ర‌రెడ్డిగారు పంపిణిదారునిగా  ఏ సినిమా చేసిన హిట్.  నిర్మాతగా కూడా సక్సెస్ అవుతారన్నారన్న నమ్మకం ఉందన్నారు.

అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌, అవ‌స‌రాల శ్రీ‌నివాస్‌, ర‌ణ‌ధీర్‌, ధ‌న్‌రాజ్‌, వెన్నెల‌కిషోర్‌, పెళ్లి పృధ్వీ, స‌మీర్‌, ముఖ్తార్‌ఖాన్‌, రామ‌రాజు, జ్యోతి త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్: బాలాజీ శ్రీ‌ను, ఎడిట‌ర్: ఎస్‌.బి. ఉద్ద‌వ్‌, మ్యూజిక్: రోషన్ సాలూరి , ఆర్ట్ డైరెక్ట‌ర్: కె.వి.ర‌మ‌ణ‌,  రచయిత : రాజేంద్ర భరద్వాజ్, డైరెక్ట‌ర్ ఆఫ్ ఫొటోగ్ర‌ఫీ: స‌తీష్ ముత్యాల‌, లైన్ ప్రొడ్యుసర్: ఎమ్‌.విజ‌య చౌద‌రి, నిర్మాత‌లు: బి.న‌రేంద్ర‌రెడ్డి, శ‌ర్మ చుక్కా, క‌థ‌, స్క్రీన్‌ప్లే,ద‌ర్శ‌క‌త్వం: రాజేష్ నాదెండ్ల‌

Anasuya Kathanam Movie Release Date Fixed:

Anasuya Kathanam Movie Release on Aug 09

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ