Advertisementt

సంక్రాంతి రేస్ నుంచి ఆ సినిమాలు అవుట్!

Wed 24th Jul 2019 08:15 PM
2020 sankranthi,star heroes movies,small budget films,nithiin,allu arjun,mahesh babu,sai tej,raviteja  సంక్రాంతి రేస్ నుంచి ఆ సినిమాలు అవుట్!
Small and Medium Budget Films Out in Sankranthi Race సంక్రాంతి రేస్ నుంచి ఆ సినిమాలు అవుట్!
Advertisement
Ads by CJ

2020 సంక్రాంతికి ఆల్రెడీ రెండు పెద్ద సినిమాలు రెడీ గా ఉన్నాయి. అల్లు అర్జున్ 19 మూవీ, మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలు లైన్ లో ఉన్నాయి. వీటితో పాటు బాలయ్య సినిమా కూడా ఉండ నుంది. రెండు, మూడు భారీ చిత్రాలు పోటీలో ఉండడంతో ఈసారి వాటి మధ్యకి వెళ్ళడానికి చిన్న అండ్ మిడిల్ రేంజ్ సినిమాలు ధైర్యం చేయడంలేదు.

ప్రతి సంక్రాంతికి కొన్ని చిన్న సినిమాలు లేదా మీడియం సినిమాలకి స్కోప్ ఉంటది. కానీ ఈసారి రెండు, మూడు పెద్ద సినిమాలు ఉండటంతో ఇంకా ముందుగానే రావాలని డిసైడ్ అయ్యారు మీడియం అండ్ చిన్న సినిమా నిర్మాతలు. సంక్రాంతి తరువాత మళ్లీ బాక్సాఫీస్‌ డల్‌ అయిపోతుంది కనుక ముందుగానే అంటే డిసెంబర్‌లోనే వచ్చేయాలని పలువురు హీరోలు డిసైడయ్యారు.

ఈ లిస్ట్‌లో నితిన్ ‘భీష్మ’తో పాటు రవితేజ ‘డిస్కోరాజా’ అలానే సాయి ధరమ్ తేజ్ ‘ప్రతిరోజు పండగే’  చిత్రాలు డిసెంబర్‌లో రిలీజ్ కానున్నాయి. ఇవి కాకుండా మరో రెండు మూడు చిన్న సినిమాలు అదే నెలలో రానున్నాయి. పైగా ఇద్దరు స్టార్ ప్రొడ్యూసర్స్ సంక్రాంతి రేస్‌లో ఉండడంతో చిన్న సినిమా నిర్మాతలు అడుగు కూడా ముందుకు వేయడంలేదు.

Small and Medium Budget Films Out in Sankranthi Race:

Nithiin, Sai Dharam Tej, Raviteja Out From Sankranthi Race

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ