మెగాస్టార్ చిరంజీవితో పూరి జగన్నాధ్ ఎప్పటినుండో ఒక సినిమా తీయాలనుకుంటున్నాడు. కానీ వర్కవుట్ అవ్వడంలేదు. ఎన్ని సార్లు ట్రై చేసినా సెట్స్ మీదకు మాత్రం వెళ్లడంలేదు. రెండు సార్లు అయితే పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి కానీ సెట్స్ మీదకు వెళ్ళలేదు. ఆమధ్య పూరి చిరుకి ఆటోజానీ అనే చిత్రం కథ చెప్పాడు. సెకండాఫ్ చిరుకి నచ్చలేదు. దాంతో మరో కథ కూడా తీసుకుని వెళ్లి పూరి చిరుని ఒప్పించడానికి ట్రై చేసాడు కానీ వర్కవుట్ కాలేదు.
కానీ చిరు ఓకే అంటే ఐదు రోజుల్లో కథ రాసుకుని వెళ్తా అని పూరి రీసెంట్‌గా ఇంటర్వ్యూలో అన్నారు. ఇస్మార్ట్ శంకర్ తరువాత పూరి చిరుతోనే సినిమా తీయాలనుకుంటున్నాడు. దీనిని మెగా ఫ్యామిలీ పరిగణించినట్టే వున్నారు. రీసెంట్ గా రామ్ చరణ్.. ఇస్మార్ట్ శంకర్ చూసి రామ్ ఎనర్జీని, పూరి స్కిల్స్‌ని మెచ్చుకున్నాడు. ఈసినిమాను మిగిలిన టాప్ హీరోస్ ఎవరు చూడలేదు. రామ్ చరణ్ తప్ప.
రామ్ చరణ్ చేసిన ఈ ట్వీట్ తో పూరికి మళ్లీ మెగా కాంపౌండ్ గేట్లు తెరుచుకుంటాయా? చరణ్ ఇండైరెక్ట్ గా పూరిని ఏమన్నా కథ ఉంటే చెప్పు అంటున్నాడా? ఏమో చూడాలి. మెగాస్టార్ నుండి మాస్ సినిమా రావాలని మెగా కాంపౌండ్ భావిస్తే పూరినే కదా బెస్ట్ ఆప్షన్.