Advertisementt

అక్కడ చరణ్‌ని బీట్ చేసిన విజయ్ దేవరకొండ!

Sat 27th Jul 2019 02:39 AM
vinaya vidheya rama,dear comrade,overseas,premiere collections,ram charan,vijay deverakonda  అక్కడ చరణ్‌ని బీట్ చేసిన విజయ్ దేవరకొండ!
Vijay Deverakonda Beats Ram Charan at Overseas అక్కడ చరణ్‌ని బీట్ చేసిన విజయ్ దేవరకొండ!
Advertisement
Ads by CJ

విజయ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్ మీద భారీ అంచనాలున్నాయి. భరత్ కమ్మ తెరకెక్కించిన డియర్ కామ్రేడ్ భారీ అంచనాల నడుమ నేడు థియేటర్స్‌లోకి వచ్చింది. హిట్ ఫెయిర్ గా పేరు తెచ్చుకున్న విజయ దేవరకొండ- రష్మికాల కలయికలో తెరకెక్కిన ఈ సినిమా మీద భీభత్సమైన అంచనాలున్నాయి. స్టూడెంట్ యూనియన్‌కి లీడర్‌గా విజయ్ దేవరకొండ, క్రికెటర్‌గా రష్మికలు ఈ సినిమాలో నటించారు. ఈ సినిమాకి మెయిన్ హైలెట్ లిప్ లాక్స్. అందుకే యూత్‌లో ఈ సినిమాపై క్రేజ్ భారీగా ఏర్పడింది. ఇక ఈ రోజు ఇండియాలో విడుదలైన డియర్ కామ్రేడ్ నిన్న గురువారం రాత్రే ఓవర్సీస్ లో ప్రీమియర్స్ పడ్డాయి.

అయితే ఈ ఏడాది యుఎస్ ప్రీమియర్స్ లో మహర్షి 5.16 లక్షల డాలర్లు, ఎన్టీఆర్ కథానాయకుడు 4.83 లక్షల డాలర్లు, ఎఫ్2 చిత్రం 2.59 లక్షల డాలర్ల వసూళ్లతో వరస స్థానాల్లో ఉండగా.. తాజాగా రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ ప్రీమియర్ వసూళ్లను ఇప్పుడు విజయ్ డియర్ కామ్రేడ్ దాటేసింది. యుఎస్ ప్రీమియర్స్ ద్వారా డియర్ కామ్రేడ్  2.5 లక్షల డాలర్స్ వసూలు చేసింది. 

ఈ ఫిగర్ చరణ్ వినయ విధేయ రామ కన్నా ఎక్కువ కావడం గమనార్హం. మరి విజయ్ దేవరకొండ క్రేజ్ యుఎస్‌లో ఏ లెవల్లో ఉందో ఈ ప్రీమియర్స్ కలెక్షన్స్ చూస్తుంటే అర్ధమవుతుంది. మరి విజయ్ డియర్ కామ్రేడ్ కి హిట్ టాక్ పడిందా ఇక ఓవర్సీస్‌లో విజయ్ దేవరకొండ మిగతా స్టార్ హీరోలకు కూడా చెక్ పెట్టెయ్యడం ఖాయం.

Vijay Deverakonda Beats Ram Charan at Overseas:

Dear Comrade Beats Vinaya Vidheya Rama in overseas

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ