Advertisementt

‘సైరా’ కోసం చిరు కత్తెర పట్టాడు

Sat 27th Jul 2019 02:41 AM
chiranjeevi,sye raa narasimha reddy,sye raa,editing,mega star chiranjeevi  ‘సైరా’ కోసం చిరు కత్తెర పట్టాడు
Chiranjeevi Takes Editor Job for Sye Raa Narasimha Reddy ‘సైరా’ కోసం చిరు కత్తెర పట్టాడు
Advertisement
Ads by CJ

సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఫ్రీడమ్ ఫైటర్ సినిమా ‘సైరా’ చిత్ర షూటింగ్ ఈమధ్యే కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్‌కి సిద్ధం అయింది. అయితే ఇక్కడ చిరుతో పాటు ఫ్యాన్స్‌ని కంగారు పెట్టే అంశం ఏంటంటే ఈసినిమా యొక్క రన్ టైం. తాజా సమాచారం ప్రకారం ఈమూవీ రన్ టైం 3 గంటల 30 నిముషాలు వచ్చిందట.

అయితే చిరు 3 గంటలు సినిమాకి అంత కంగారు పడడంలేదట. ఎందుకంటే ‘రంగస్థలం’ మూడు గంటలు ఉంది కాబట్టి. కాకపోతే మిగిలిన 30 నిముషాలు గురించి టెన్షన్ పడుతున్నాడట. 3 గంటలు ప్రేక్షకులని కూర్చోబెట్టడం అంటే మాములు విషయం కాదు. ఎక్కడ లాగ్ వచ్చినా బోర్‌గా ఫీల్ అవుతారు. అలా అనిపిస్తే సినిమాపై ఎఫెక్ట్ పడుతుంది. పైగా ఇప్పుడు 3 గంటల 30 నిముషాలు అంటే సాధ్యం కానీ పని. అందుకే చిరు గత రెండు రోజులు నుండి ఎడిటింగ్ టేబుల్ మీద కూర్చుని అవసరం లేని సీన్స్ అన్ని తీసేస్తున్నాడట.

భారీగా విజువల్ ఎఫెక్ట్స్ కోసం ఖర్చు పెట్టినవని కూడా ఆలోచించకుండా తీసేస్తున్నాడట. ఇలా చేయడం వల్ల సినిమా రన్ టైం కొంచమైనా తగ్గించొచ్చని చిరు ఆలోచన. ఓవరాల్‌గా ఈ సినిమా రన్ టైం మూడు గంటల లోపే ఉండేలా చేయాలని చిరు ట్రై చేస్తున్నారట. ఇక ఈ మూవీ అక్టోబర్ 2న రిలీజ్ కానుంది.

Chiranjeevi Takes Editor Job for Sye Raa Narasimha Reddy:

Chiranjeevi Edits Sye Raa Narasimha Reddy Run time

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ