Advertisementt

కేటీఆర్‌ను కలిసిన ‘మనం సైతం’ టీమ్

Sat 27th Jul 2019 02:44 AM
ktr,supports,kadambari kiran,manam saitham  కేటీఆర్‌ను కలిసిన ‘మనం సైతం’ టీమ్
Manam Saitham Team Meets KTR కేటీఆర్‌ను కలిసిన ‘మనం సైతం’ టీమ్
Advertisement
Ads by CJ

మనం సైతంకు అండగా ఉంటా... - యువ నాయకులు కేటీఆర్

మనం సైతం సేవా సంస్థ వ్యవస్థాపకులు కాదంబరి కిరణ్ తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల మనం సైతం సంస్థ చేపట్టిన సేవా కార్యక్రమాలను ఆయనకు వివరించారు. మనం సైతం తరుపున మొక్కను, బ్రోచర్ ను అందించారు. మీరు అనుకున్న కార్యక్రమాలు చేయండి నేను అండగా ఉంటానంటూ కేటీఆర్ ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. త్వరలో మనం సైతం నిర్వహించబోయే మెగా కార్యక్రమంలో పాల్గొంటానని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఎంతో బిజీగా ఉన్నా కలిసేందుకు సమయం ఇచ్చిన కేటీఆర్ కు కాదంబరి కృతజ్ఞతలు తెలిపారు. కేటీఆర్ మార్గదర్శనంలో మరింత విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేస్తామని కాదంబరి కిరణ్ తెలిపారు. 

కాదంబరితో పాటు కేటీఆర్ ను కలిసిన వారిలో పరుచూరి వెంకటేశ్వరరావు, వల్లభనేని అనిల్, రమేష్ రాజా, మహానందరెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి, మనం సైతం సభ్యులు ఉన్నారు.

Manam Saitham Team Meets KTR:

KTR Supports to Kadambari Kiran Manam Saitham

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ