మహర్షి సినిమాకి ముగ్గురు నిర్మాతలు అని అందరికి తెలిసిన విషయమే. ఈ సినిమాకి ఏకంగా వంద కోట్లు షేర్ వచ్చినా నిర్మాతలకి మిగిలింది ఏమి లేదు. ఎందుకంటే మహేష్ భారీ రెమ్యూనరేషన్ తో పాటు వంశీ పైడిపల్లి చేసిన వేస్టేజీ వల్ల బడ్జెట్ పెరగడంతో నిర్మాతలకు ఏమి మిగలలేదు. ఇక ఈమూవీకి నిర్మాతగా వ్యవహరించిన దిల్ రాజు ఇప్పుడు మహేష్ లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు మూవీకి నిర్మాతగా ఉండాలని మహేష్ దిల్ రాజుని పట్టుబట్టాడు.
మహేష్ ఫోర్సింగ్ వల్ల దిల్ రాజు ఈసినిమాకి వన్ అఫ్ ది నిర్మాత అయ్యాడు. దిల్ రాజుతో పాటు అనిల్ సుంకర కూడా ఈసినిమా నిర్మిస్తున్నారు. ఇలా రెండు బ్యానర్స్ లో తెరకెక్కుతున్న ఈసినిమా కోసం మహేష్ వాటాగా 50 కోట్లు పైగానే వెళుతుందనేది ఇండస్ట్రీ టాక్. ఒక్క హీరోనే ఇంత తీసుకుంటే మాకు ఏంటి మిగిలేది? మిగిలిన ఆర్టిస్ట్స్ కి ఏమి ఇవ్వాలి? సినిమాకి ఎంత ఖర్చుపెట్టాలి? అసలు చివరికి నిర్మాతలకి ఏమి మిగులుతుంది? అనుకుంటున్నారు నిర్మాతలు.
బాలీవుడ్ హీరోలు మాదిరిగా ఇక్కడ హీరోస్ కూడా లాభాల్లో వాటా మాత్రమే తీసుకోవాలని, తద్వారా నిర్మాతపై భారం తగ్గుతుందని... అప్పుడే నిర్మాతలు ఫీల్డ్ లో ఉండగలరు అని అంటున్నాడు దిల్ రాజు.