తార క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ పారిశ్రామికవేత్త బ్రహ్మానందరెడ్డి నిర్మించిన చిత్రం ‘బైలంపుడి’. హరీష్ వినయ్, తనిష్క తివారి జంటగా నటించగా అనిల్ పిజి రాజ్ దర్శకత్వం వహించారు. గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదలై ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఈ రోజు ఫిలించాంబర్ లో సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాత బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ...‘‘పారిశ్రామికవేత్తగా ఉన్న నేను సినిమా మీద ఆశక్తతో తొలిసారిగా నిర్మాతగా ‘బైలంపుడి’ చిత్రాన్ని నిర్మించాను. ‘ఇక్కడ యుద్ధం చేయాలి... గెలవడానికి కాదు, బతకాడినికి’ అనే కాన్సెప్ట్ తో రూపొందించిన మా సినిమా ఈ శుక్రవారం విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. చూసిన వాళ్లందరూ సినిమా చాలా బావుందంటున్నారు. నేను ఇందులో గురునారాయణ అనే విలన్ క్యారక్టర్ చేశాను. నిర్మాతగా, నటుడుగా నాకు ఈ సినిమా పూర్తి సంతృప్తినిచ్చింది. మౌత్ టాక్ తో ఇప్పుడిప్పుడే జనం థియేటర్స్ కు వస్తున్నారు. డిస్ట్రిబ్యూటర్స్ కోరిక మేరకు కొన్ని థియేటర్స్ కూడా పెంచుతున్నాం. ఇంకా పెద్ద సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నా’’ అన్నారు.
సంగీత దర్శకుడు సుభాష్ ఆనంద్ మాట్లాడుతూ... ‘‘నిన్న విడుదలైన మా సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. నేపథ్య సంగీతంతో పాటు పాటలు కూడా బావున్నాయంటూ కాల్స్ చేసి చెబుతున్నారు. ముఖ్యంగా ‘పిల్లల దేవుడు’ పాటకు అద్భుతమైన స్పందన వస్తోంది’’ అన్నారు.
హీరో హరీష్ వినయ్ మాట్లాడుతూ... ‘‘ఫస్ట్ డే సంధ్య థియేటర్ లో ఆడియన్స్ తో కలిసి సినిమా చూశాం. ఆడియన్స్ సినిమాను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంత మంచి రెస్పాన్స్ నా తొలి సినిమాకు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు’’.
లిరిక్ రైటర్ రామారావు మాట్లాడుతూ... ‘‘దర్శక నిర్మాత ఇచ్చిన స్వేచ్ఛతో మంచి సాహిత్యాన్ని రాశాను. సుభాష్ గారు అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చారు. ముఖ్యంగా పిల్లల దేవుడు సాంగ్ కు రెస్పాన్స్ బావుందన్నారు.
హీరోయిన్ తనిష్క తివారి మాట్లాడుతూ... ‘‘ఇష్టంగా సినిమా తర్వాత ఓ మంచి సినిమా కోసం వెయిట్ చేస్తోన్న తరుణంలో ఈ సినిమా అవకాశం వచ్చింది. పర్ఫార్మెన్స్ కు స్కోపున్న పాత్రలో నటించడం చాలా హ్యాపీగా ఉందన్నారు’’.
దర్శకుడు అనిల్ పిజి రాజ్ మాట్లాడుతూ... ‘‘విడులైన అన్ని ఏరియాల నుంచి రెస్సాన్స్ బావుంది. డిస్ట్రిబ్యూటర్స్ కోరిక మేరకు ఇంకా థియేటర్స్ పెంచుతున్నాం. సుభాష్ సంగీతం, మా హీరో, హీరోయిన్స్ నటన, అలాగే మా నిర్మాత బ్రహ్మానంద రెడ్డిగారు చేసిన విలన్ క్యారక్టర్ కు రెస్పాన్స్ బావుంది. మా టీమ్ సపోర్ట్ వల్లే ఒక మంచి సినిమా తీయగలిగాను. మా సినిమాను ఇంకా పెద్ద సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నా’’ అన్నారు.
హరీష్ వినయ్, తనిష్క తివారి, బ్రహ్మానంద రెడ్డి, సుచిత్ర, గణి, గోవింద్, నటరాజ్, నరి, నాగార్జున, సెబాస్టియన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సుభాష్ ఆనంద్, డైలాగ్స్: సాయి, ఎడిటర్: జానకిరామ్, ఫైట్స్: కృష్ణం రాజ్, ఆర్ట్: ఉత్తమ్‌కుమార్, డాన్స్: ఘోరా, లిరిక్స్: రామారావు, పిఆర్వో: వంగాల కుమారస్వామి, నిర్మాత: బ్రహ్మానందరెడ్డి, సినిమాటోగ్రాఫర్-స్టోరి-స్క్రీన్‌ప్లే-డైరక్షన్: అనిల్ పిజి రాజ్.