Advertisementt

దిల్ రాజు చూపు.. సీనియర్ హీరోల వైపు..!

Mon 29th Jul 2019 07:41 PM
dil raju,chiranjeevi,balakrishna,senior heroes,tollywood,nagarjuna,venkatesh  దిల్ రాజు చూపు.. సీనియర్ హీరోల వైపు..!
Dil Raju Eye on Senior Heroes దిల్ రాజు చూపు.. సీనియర్ హీరోల వైపు..!
Advertisement
Ads by CJ

టాలీవుడ్‌లో దిల్ రాజు అంటే యంగ్ అండ్ న్యూ హీరోస్‌కి ఓ దేవుడు లాంటి నిర్మాత. ఆయన యంగ్ హీరోలతో మీడియం రేంజ్ సినిమాలు చేస్తూ వాళ్ళకి లైఫ్ ఇస్తుంటాడు. అయన సినిమాలు చేసేది కేవలం హీరోలకి మేలు చెయ్యడానికే కాదు... ఆయన సంపాదించుకోవడానికి కూడా.. టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ నిర్మాతగా దిల్ రాజు మంచి సినిమాలతో పాటుగా కొన్ని డిజాస్టర్ సినిమాలు కూడా చేసాడు. అయితే ఎక్కువగా కొత్త హీరోలతోనూ, యంగ్ హీరోలతోనూ సినిమాలు చేసే దిల్ రాజు స్టార్ హీరోలతో చేసిన సినిమాలు మాత్రం చాలా తక్కువే అని చెప్పుకోవాలి. ఇక సీనియర్ హీరోలలో వెంకటేష్‌, నాగ్‌తో మాత్రమే ఆయన సినిమాలు చేశాడు. చిరు, బాలయ్యలతో ఆయన ఇప్పటి వరకు సినిమాలు చేయలేదు.

తాజాగా బాలకృష్ణతో త్వరలోనే దిల్ రాజు సినిమా ఉంటుందనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. తాజాగా దిల్ రాజు.. చిరుతో కూడా ఓ సినిమా చేయబోతున్నాడనే టాక్ ఫిలింసర్కిల్స్ లో వినబడుతుంది. అయితే చిరు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాక కేవలం రామ్ చరణ్ ప్రొడ్యూసర్ గా కొణిదెల ప్రొడక్షన్స్ లోనే సినిమాలు చేస్తున్నాడు. ఇక ఖైదీ నెంబర్ 150 తో పాటుగా సై రా సినిమాలు చేసిన చిరు.. కొరటాల మూవీ కూడా కొణిదెల ప్రొడక్షన్ లోనే చెయ్యబోతున్నాడు. ఇక తదుపరి చిత్రానికైనా రామ్ చరణ్, అల్లు అరవింద్ కి ఛాన్స్ ఏమన్నా ఇస్తాడేమో అని చూస్తున్నాడు. 

ఎందుకంటే ఖైదీ తర్వాత సై రా కైనా అరవిందకి ఛాన్స్ వస్తుందేమో, లేదంటే కొరటాల మూవీ అయినా నిర్మిద్దామనుకుంటే.. చరణ్ ఆయనకు ఛాన్స్ ఇవ్వడం లేదు. కానీ దిల్ రాజు కి ఆ ఛాన్స్ దక్కుతుందా...  అంటే డౌటే. అయితే కొరటాల మూవీ తర్వాత చిరు... దిల్ రాజుతో సినిమా చేసే ఛాన్స్ ఉందని.. చిరు, కొరటాల మూవీ ని ఫినిష్ చేసే లోపల దిల్ రాజు గనక కథ, దర్శకుడితో సిద్ధంగా ఉంటే.. చిరుతో సినిమా చేసే ఛాన్స్ దిల్ రాజుకి దక్కుతుందనేది ఫిలింనగర్ న్యూస్.

Dil Raju Eye on Senior Heroes:

Dil Raju Plans Movies with Chiranjeevi and Balakrishna

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ