సన్నీలియోన్.. ఈ పేరు చెబితేనే ముసలోడు మొదలుకుని కుర్రకారు నిద్రలో అయినా సరే లేచి కూర్చుంటారు!. అదీ సన్నీ రేంజ్.. శృంగార తారగా ఓ వెలుగు వెలిగిన తర్వాత ఇప్పుడు బాలీవుడ్‌లోకి వచ్చి తన కంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. వన్స్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈ ముదురు భామ వెనక్కి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. అలా సినిమాలు, టైటిల్ సాంగ్స్‌తో బిజీబిజీగా లైఫ్ సాగిస్తోంది.
అయితే ఇటీవల జరిగిన చిత్రబృందం చేసిన చిన్నపాటి పొరపాటుతో సన్నీని జనాలు తెగతిట్టుకుంటున్నారు. ‘అర్జున్ పటియాలా’ సినిమాలో ఓ సీన్‌లో సన్నీ.. దిల్జీత్‌కు ఫోన్ నంబర్ ఇస్తుంది. ఆ నంబర్‌ను పట్టుకున్న జనాలు ‘ఎస్.. సెక్సీ సన్నీ నెంబర్ దొరికేసిందోచ్’ అంటూ తెగ ఫోన్లు చేస్తున్నారు. తీరా చూస్తే అది ఢిల్లీకి చెందిన పునీత్ అగర్వాల్ అనే వ్యక్తిది అని తేలింది.
దీంతో నిమిషానికొకరు ఫోన్ చేసి ‘సెక్సీ సన్నీ ఉందా’ అని అడుగుతున్నారట. ఇలా రోజుకు 150 కాల్స్ వస్తున్నాయట. అంతేకాదు అసభ్యకరంగా మెసేజ్‌లు, వీడియో కాల్స్ కూడా వస్తున్నాయట. ఈ ఫోన్ కాల్స్‌తో విసుగు చెందిన పునీత్.. ‘అర్జున్ పటియాలా’ నిర్మాతలపై కేసు వేసే యోచనలో ఉన్నారట. ఫిర్యాదు చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో మరి. కాగా.. ఇటీవల విడుదలైన అర్జున్ పటియాలా మూవీలో అతిధి పాత్రతో పాటు.. స్పెషల్ సాంగ్‌లో కనిపించి సన్నీ.. కుర్రకారును అన అందచందాలు ఆరబోసి కైపెక్కించింది.