Advertisementt

‘ఒకే ఒక్కడు’ సీక్వెల్ ఎవరితోనో తెలుసా?

Fri 02nd Aug 2019 11:37 PM
shankar,oke okkadu,movie,sequel,vijay  ‘ఒకే ఒక్కడు’ సీక్వెల్ ఎవరితోనో తెలుసా?
Oke Okkadu Movie Sequel Update ‘ఒకే ఒక్కడు’ సీక్వెల్ ఎవరితోనో తెలుసా?
Advertisement
Ads by CJ

కోలీవుడ్ లో ఇళయ దళపతి విజయ్ క్రేజ్ ఏంటో వేరే చెప్పనసరంలేదు. అతని సినిమా వస్తుందంటే మాములుగా ఉండదు. అలానే శంకర్ సినిమా అన్నా అక్కడ క్రేజ్ ఎక్కువ. అలాంటిది వీరి కాంబినేషన్ లో ఓ సినిమా వస్తుందని వార్తలు వస్తున్నాయి.

అవును.. విజయ్ - శంకర్ ల కాంబినేషన్ ఓ సూపర్ హిట్ చిత్రం సీక్వెల్ రానుంది. ఆ దిశగా ఇద్దరి మధ్య కూడా చర్చలు సాగుతున్నట్టు చెబుతున్నారు. ఆ సినిమానే ‘ఒకే ఒక్కడు’ సీక్వెల్. విజయ్ తో శంకర్ ఎప్పటినుండో ఈసినిమా తీయాలని చూస్తున్నాడట. అటు విజయ్ కూడా శంకర్ డైరెక్షన్ లో ఏదన్నా మూవీ చేయాలనీ చూస్తున్నాడు. ఈనేపధ్యంలో ఇద్దరి మధ్య చర్చలు కూడా జరుగుతున్నాయి అని చెబుతున్నారు.

అర్జున్ హీరోగా ఒకే ఒక్కడు సినిమా ఎంత పెద్ద విజయం సాధించింది అనే విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అర్జున్ ప్లేస్ లో విజయ్ చేయనున్నాడు. సో ఇటువంటి క్రేజీ కాంబినేషన్ లో సినిమా వస్తుందంటే అటు విజయ్ ఫ్యాన్స్ కి ఇటు శంకర్ ఫ్యాన్స్ కి ఏం కావాలి చెప్పండి! త్వరలోనే ఈమూవీపై క్లారిటీ ఇవ్వనున్నారు మేకర్స్.

Oke Okkadu Movie Sequel Update:

Shankar plans Oke Okkadu Movie Sequel with Vijay

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ