Advertisementt

డ్వేన్ బ్రావోతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిత్రం

Sat 03rd Aug 2019 08:26 PM
dwayne bravo,people media factory,ant productions,men take lead,west indies cricketer  డ్వేన్ బ్రావోతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిత్రం
Dwayne Bravo has released the poster of short film where he plays a keyrole, posted in his fb account డ్వేన్ బ్రావోతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిత్రం
Advertisement
Ads by CJ

షూటింగ్ జరుపుకుంటున్న ప్రపంచ ప్రఖ్యాత వెస్టీండీస్‌ క్రికెట్ ఆటగాడు  

ప్రపంచ ప్రఖ్యాత వెస్టీండీస్‌ క్రికెట్ ఆటగాడు డ్వేన్ బ్రావోతో ప్ర‌ముఖ నిర్మాణ‌ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సోష‌ల్ అవేర్నేష్ ఫిల్మ్‌ను అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్న విష‌యం తెలిసిందే. కేవ‌లం ఎంట‌ర్‌టైన్మెంట్ మూవీస్ మాత్ర‌మే కాకుండా... అన్ని ర‌కాల జోన‌ర్స్‌లో విభిన్న క‌థా చిత్రాల‌ను అందించాల‌నేదే పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఉద్దేశ్యం. అందులో భాగంగానే ‘ఎం.ఎల్.ఎ, వైఫ్ ఆఫ్ రామ్, గూఢ‌చారి, ఓ..బేబి..’ ఇలా వైవిధ్య‌మైన, విజ‌య‌వంత‌మైన చిత్రాలు నిర్మించి అన‌తి కాలంలోనే అటు ఆడియ‌న్స్ లో, ఇటు ఇండ‌స్ట్రీలో అభిరుచి గ‌ల నిర్మాణ సంస్థ‌గా మంచి గుర్తింపు ఏర్పరుచుకుంది పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ. ప్ర‌స్తుతం విక్ట‌రీ వెంక‌టేష్ - యువ సామ్రాట్ నాగ చైత‌న్య‌ల క్రేజీ కాంబినేష‌న్ లో భారీ మ‌ల్టీస్టార‌ర్ ‘వెంకీ మామ’ చిత్రాన్ని, అలాగే అనుష్క ప్ర‌ధాన పాత్ర‌లో ‘నిశ్శ‌బ్దం’ అనే ఇంట‌ర్నేష‌న‌ల్ మూవీని కూడా నిర్మిస్తుంది.

అయితే... కేవలం వ్యాపార దృక్పథమే కాకుండా, సామాజిక స్పృహకు సంబంధించిన విషయాలలో కూడా ప్రజలలో అవగాహన కల్పించాల‌నే స‌దుద్దేశ్యంతో సోష‌ల్ అవేర్నెస్ ఫిల్మ్స్ ను నిర్మిస్తున్నారు సంస్థ నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల. ఈ నిర్మాణ సంస్థ‌తో ఎ.ఎన్.టి ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ క‌లిసి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా సోష‌ల్ అవేర్నెస్ ఫిల్మ్ ను నిర్మిస్తోంది.

‘కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR)’ లో భాగంగా వెస్టీండీస్‌ క్రికెట‌ర్ డ్వేన్ బ్రావోతో క‌లిసి ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈ మూవీకి ఆర్తి శ్రీవాత్స‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఆమె ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ల్యాండ్ ఆఫ్ విడోస్ మరియు వైట్ నైట్ ఈ రెండు డాక్యుమెంట‌రీస్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్స్ లో అవార్డులు గెలుచుకున్నాయి. ఇప్పుడు మ‌హిళల‌కు శుభ్ర‌త విష‌యంలో అవ‌గాహ‌న క‌ల్పించేందుకుగాను ఈ సినిమాని నిర్మిస్తున్నారు. 

డ్వేన్ బ్రావో తన అధికారిక సోషల్ మీడియా ఖాతా అయినా ఫేస్ బుక్‌లో ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు.

ఈ చిత్ర విశేషాల‌ను ద‌ర్శ‌కురాలు ఆర్తి శ్రీవాత్స‌వ తెలియ‌చేస్తూ...డ్వేన్ బ్రావోతో క‌లిసి ఈ సినిమాని నిర్మిస్తున్నందుకు చాలా సంతోషంగాను, గ‌ర్వంగాను ఉంది. జులైలో త‌మిళ‌నాడులో షూటింగ్ జరిగింది. దీంతో ఇండియాలో షూటింగ్ పూర్త‌య్యింది. ఆగ‌ష్టులో వెస్టీండీస్‌ లోని ట్రినిడాడ్, టోబాగోల‌లో షూటింగ్ చేయ‌నున్నాం అని చెప్పారు.

ఈ మూవీకి నిర్మాత - టి.జి.విశ్వ‌ప్ర‌సాద్, కో - ప్రొడ్యూస‌ర్ - వివేక్ కూచిభోట్ల‌, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ - శ్రీ న‌ట‌రాజ్, ప్రాజెక్ట్ డిజైన్ & ఎగ్జిక్యూష‌న్ - ఎ.ఎన్.టి ప్రొడక్ష‌న్స్.

Dwayne Bravo has released the poster of short film where he plays a keyrole, posted in his fb account:

The world-famous West Indies cricketer Dwayne Bravo has collaborated with renowned production company People Media Factory and ANT productions to make a social awareness film.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ