Advertisementt

నేను చేసిన రెండు మంచి పనులు ఇవే: పూరి

Sun 04th Aug 2019 01:28 PM
celebrities,speech,ismart shankar,movie,success meet  నేను చేసిన రెండు మంచి పనులు ఇవే: పూరి
Ismart Shankar Movie Success Meet Details నేను చేసిన రెండు మంచి పనులు ఇవే: పూరి
Advertisement
Ads by CJ

ఈ మధ్య కాలంలో నేను చేసిన రెండు మంచి పనులు ఒకటి రామ్ ను కలవడం.. రెండోది ఇస్మార్ట్ శంకర్ తీయడం- ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ మీట్ లో పూరి జగన్నాధ్

ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ హీరోగా, డాషింగ్‌ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో పూరి జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌, పూరి కనెక్ట్స్‌ పతాకాలపై పూరి జగన్నాథ్‌, ఛార్మి నిర్మించిన చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. నభా నటేష్‌, నిధి అగర్వాల్‌ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం జూలై 18న ప్రపంచవ్యాప్తంగా విడుద‌లైంది. స‌క్సెస్‌ఫుల్‌గా బాక్సాఫీస్ వ‌ద్ద స‌త్తా చాటుతూ ఇస్మార్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచి రూ.75 కోట్ల గ్రాస్‌ను సాధించింది. ఈ సందర్భంగా శ‌నివారం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో చిత్ర యూనిట్ పాల్గొన్నారు.

ఈ సందర్బంగా పూరీ జగన్నాధ్ మాట్లాడుతూ...

‘నేను ఈ మధ్య కాలంలో చేసిన రెండు మంచి పనులు రామ్ ను కలకడం, ఇస్మార్ట్ శంకర్ సినిమా తీయడం. అందరి ఆదరణతో ఈ సినిమా ఇస్మార్ట్ బ్లాక్ బస్టర్ అయ్యింది. సినిమా చూసి చాలా మంది నా మిత్రులు అప్రిసియేట్ చేసారు. రామ్ ఎనర్జీ ఈ సినిమాను నిలబెట్టింది. ఈ సినిమా సక్సెస్ టూర్ వెళ్ళినప్పుడు అందరూ బాగా రిసీవ్ చేసుకున్నారు. రామ్ క్యారెక్టర్ గురించి మాట్లాడుకోడం ఆనందమేసింది’ అన్నారు.

హీరో రామ్ మాట్లాడుతూ... ‘సినిమా చూసాక ఎలా ఫీల్ అయ్యానో ఆడియన్స్ రెస్పాన్స్ చూసాక అదే ఫీల్ అయ్యాను. నేను ఇదివరకు చేస్తున్న పాత్రలకు భిన్నంగా ఈ సినిమాలో నా పాత్ర ఉంది, అందుకు కారణం పూరీ గారు. నాకు ఒక మంచి క్యారెక్టరైజేషన్ ఇచ్చి నన్ను డిఫరెంట్ గా ప్రెజెంట్ చేసారు. ఈ సక్సెస్ ను నా మంచి కోరుకునే వారందరికీ డెడికేట్ చేస్తున్నాను. మణిశర్మ గారి సంగీతం, హీరోయిన్స్ గ్లామర్ సినిమా సక్సెస్ కు యాడ్ అయ్యాయి.  సినిమాలో నటించిన ఇతర నటీనటులకు టెక్నీషియన్స్ కు థాంక్స్ చెబుతున్నాను’ అన్నారు.

ఛార్మి మాట్లాడుతూ... ‘మా సినిమాను ఇస్మార్ట్ బ్లాక్ బస్టర్ చేసిన అందరికి థాంక్స్. సక్సెస్ టూర్ లో ఎక్కడికి వెళ్లినా సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది. రామ్ తన బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చారు. అలాగే నిధి, నభా న‌టేశ్‌, ఇద్ద‌రూ చాలా బాగా నటించారు. ఇంత రెస్పాన్స్ ఎక్స్‌పెక్ట్  చేయలేదు. పూరి గారు రామ్ పాత్రను బాగా డిజైన్ చేశారు, అదే సినిమా సక్సెస్ కు మెయిన్ రీజన్ అయ్యింది. రామ్ కు స్రవంతి మూవీస్ ఫస్ట్ బ్యానర్ అయితే పూరి కనెక్స్ సెకండ్ హోమ్ బ్యానర్ లాంటిది. కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. త్వరలో మరో ఈవెంట్ తో మిమ్మల్ని కలుస్తాను’ అన్నారు.

హీరోయిన్ నిధి అగర్వాల్ మాట్లాడుతూ... ‘నాకు చాలా  క్రూషియల్ టైమ్‌లో ఈ హిట్ వచ్చింది. ఇది కెరీర్‌కి ఎంతో హెల్ప్ అవుతుంది. ఇంత మంచి సక్సెస్ ఇచ్చిన పూరి గారికి, అలాగే నాకు ఎంతో సపోర్ట్ చేసిన ఛార్మి గారికి థాంక్స్. రామ్ బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చారు. అలాగే న‌భా న‌టేశ్‌ బాగా నటించింది’ అన్నారు.

Ismart Shankar Movie Success Meet Details:

Celebrities Speech at Ismart Shankar Movie Success Meet

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ