Advertisementt

‘జోడి’ విడుదలకు డేట్ ఫిక్స్..!

Mon 05th Aug 2019 09:05 PM
aadi sai kumar,jodi movie,release,september 6  ‘జోడి’ విడుదలకు డేట్ ఫిక్స్..!
Jodi Movie Release date Fixed ‘జోడి’ విడుదలకు డేట్ ఫిక్స్..!
Advertisement
Ads by CJ

యూత్ ఫుల్ స్టార్ ఆది సాయికుమార్ లేటెస్ట్‌గా మరో సినిమాతో రాబోతున్నాడు. కన్నడ బ్యూటీ, ‘జెర్సీ’ ఫేమ్ శ్రధ్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా నటించింది. తాజాగా ఈ చిత్ర షూటింగ్ పూర్తయింది. సెప్టెంబర్ 6న సినిమాను గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నారు. ఇక ఈ మధ్య విడుదల చేసిన టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. టీజర్ ఆసాంతం చాలా ఆహ్లాదంగా ఉన్నట్టుగా ప్రశంసలు వచ్చాయి. ఆది సాయికుమార్ ఇమేజ్‌కు తగ్గట్టుగా ఉంటూనే యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రాబోతోంది ఈ జోడి. ముఖ్యంగా ప్రధాన జోడి మధ్య ఉండే ప్రేమకథ ఈ చిత్రానికి హైలెట్‌గా నిలవబోతోంది. అందుకు తగ్గట్టుగానే ఆదిసాయికుమార్, శ్రద్ధా శ్రీనాథ్‌ల మధ్య అద్భుతమైన కెమిస్ట్రీ కుదిరింది. గతంలో వాన, మస్కా, సినిమా చూపిస్త మామ చిత్రాలకు అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసిన విశ్వనాథ్ అరిగెల ఈ చిత్రంతో దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు.

దర్శకుడి అద్భుతమైన ప్లానింగ్ వల్ల జోడీ చాలా వేగంగా షూటింగ్ పూర్తి చేసుకోవడం విశేషం. క్వాలిటీ పరంగా ఎక్కడా రాజీ పడని నిర్మాతలు ఉండటంతో అనుకున్నదానికంటే ఇంకా బాగా వచ్చింది చిత్రం.  ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ చివరి దశలో ఉన్న జోడి చిత్ర ప్రమోషన్స్ కూడా త్వరలోనే ప్రారంభం కానున్నాయి.

ఆది సాయికుమార్, శ్రద్ధా శ్రీనాథ్ హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రంలో సీనియర్ యాక్టర్ వి.కే. నరేష్, సత్య, వెన్నెల కిశోర్, సిజ్జు, స్వప్నిక, సితార, మాధవి, గొల్లపూడి మారుతిరావు, వర్షిణి సౌందరరాజన్, ప్రదీప్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. భావనా క్రియేషన్స్ బ్యానర్‌పై శ్రీనివాస్ గుర్రం సమర్పిస్తోన్న ఈ చిత్రానికి సంగీతం : ‘నీవే’ ఫణికళ్యాణ్, సినిమాటోగ్రఫీ : ఎస్.వి. విశ్వేశ్వర్, ఎడిటర్ : రవి మండ్ల, ఆర్ట్ డైరెక్టర్ : వినోద్ వర్మ, మాటలు : త్యాగరాజు(త్యాగు), నిర్మాణత : శాంతయ్య, పి.ఆర్.వో : జి.ఎస్.కె.మీడియా, నిర్మాతలు : పద్మజ, సాయి వెంకటేష్ గుర్రం, దర్శకత్వం : విశ్వనాథ్ అరిగెల.

Jodi Movie Release date Fixed:

Jodi Movie Release on September 6th

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ