Advertisementt

నెక్స్ట్ ఏంటి? రకుల్‌.. అంటోన్న నెటిజన్స్

Wed 07th Aug 2019 10:28 AM
rakul preet singh,netizen,manmadhudu 2,questions,next film,kollywood and tollywood  నెక్స్ట్ ఏంటి? రకుల్‌.. అంటోన్న నెటిజన్స్
Netizens Questions to Rakul Preet Singh నెక్స్ట్ ఏంటి? రకుల్‌.. అంటోన్న నెటిజన్స్
Advertisement
Ads by CJ

హీరోయిన్ రకుల్ ప్రీత్ ఎంత కాన్ఫిడెంట్‌గా కనిపించినా ఆమె చేతిలో ఉన్న సినిమాల లిస్ట్ మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. నాగార్జునతో నటించిన మన్మథుడు 2 సినిమా విడుదలయ్యాక.. ఈ భామ టాలీవుడ్‌లో అయితే ఖాళీ. మరో తెలుగు సినిమా రకుల్ ప్రీత్ చేతిలో లేదు. తమిళనాట మాత్రం రెండు సినిమాలున్నాయి. తమిళంలోనూ భారీ డిజాస్టర్స్ సొంతం చేసుకున్న రకుల్... కమల్ హాసన్ సినిమా ఇండియన్ 2 లో కాజల్ తో పాటుగా సెకండ్ హీరోయిన్ గా అవకాశం దక్కించుకుంది. బాలీవుడ్‌లో రకుల్ నటించిన మార్జావాన్ కూడా విడుదలకు సిద్ధమవుతుంది. ఇక బాలీవుడ్‌లోను పాపకి పెద్దగా సినిమాలు లేవు.

సీనియర్ హీరో నాగార్జున సరసన చాలా బోల్డ్‌గా సిగరెట్, మందు కొడుతూ మన్మథుడు 2 లో రకుల్ ప్రీత్ నటించింది. ఈ సినిమాలో రకుల్ చాలా సెక్సీ‌గా, స్పైసీగా కనిపిస్తుంది. ఇక మన్మథుడు 2 ప్రమోషన్స్ లోను రకుల్ ప్రీత్ చాలా హాట్ హాట్ డ్రెస్సులతో అదరగొట్టేస్తుంది. కానీ యంగ్ అండ్ స్టార్ హీరోల చూపు మాత్రం రకుల్ మీద పడడం లేదు. అందుకే అమ్మడుకి తెలుగులో అవకాశాలు నిల్. మరి తమిళంలో ఉన్న రెండు సినిమాలు రకుల్ కెరీర్ ని డిసైడ్ చేస్తాయేమో చూడాలి. 

ఎందుకంటే రకుల్ నటించిన మన్మథుడు 2 ఒకవేళ హిట్ అయినా... దానివల్ల రకుల్ కి పెద్దగా ఉపయోగం ఉండేలా కనబడటం లేదు. ఎందుకంటే సీనియర్ హీరోల పక్కన నటించిన హీరోయిన్స్ కి డిమాండ్ అంతగా ఉండదు. మరి రకుల్ ప్రీత్ మన్మథుడు రాబోయే శుక్రవారమే విడుదలకాబోతుంది. మరి ఆ మన్మథుడు తర్వాత వాట్ నెక్స్ట్ అంటూ రకుల్ కి సోషల్ మీడియాలో అభిమానులు క్వశ్చన్ చేస్తున్నారు.

Netizens Questions to Rakul Preet Singh:

What is the Rakul Preet Sing next film in Tollywood?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ