Advertisementt

అనుష్క, సమంత బాటలో రకుల్ ప్రీత్!

Wed 07th Aug 2019 10:17 PM
rakul preet singh,rakul preet,manmadhudu-2,lady oriented   అనుష్క, సమంత బాటలో రకుల్ ప్రీత్!
Rakul Preet Gives Clarity on..... అనుష్క, సమంత బాటలో రకుల్ ప్రీత్!
Advertisement
Ads by CJ

రకుల్ ప్రీత్ సింగ్.. టాలీవుడ్‌, బాలీవుడ్ అని లేకుండా బిజిబిజీగా ఉంటోంది. టాలీవుడ్ జూనియర్, సీనియర్లతో ఇప్పటికే పలు సినిమాలు చేసిన రకుల్‌కు ఇంకా ఒక కోరిక మాత్రం అలాగే మిగిలిపోయిందట. యోగా బ్యూటీ, ముదురు భామ అనుష్క, సమంత లేడీ ఓరియెంటేడ్ కథలతో ప్రేక్షకులకు ముందుకొచ్చి సక్సెస్ అయిన విషయం విదితమే. అయితే తాను కూడా అలా లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించాలని ఉందని ఈ ముద్దుగుమ్మ తన మనసులోని మాటను చెప్పుకొచ్చింది.

కాగా.. లేడీ ఓరియెంటెడ్ పాత్రలో నటించాలని ఆఫర్ వచ్చినప్పటికీ ఆమెకు సత్తాలేక చేయలేకపోయిందని ఇటీవల పుకార్లు షికార్లు చేశాయి. అయితే తాజాగా ఈ వ్యవహారంపై రకుల్ క్లారిటీ ఇచ్చుకుంది. ఓ వైపు సీనియర్ హీరోలతో చేస్తూనే.. మరో వైపు యంగ్ హీరోలతోను చేస్తున్నానని చెప్పుకొచ్చింది. హిందీలో సిద్ధార్థ్ మల్హోత్రాతోను.. తెలుగులో నితిన్ తోను చేస్తున్నానని మీడియాకు వివరించింది. 

అయితే.. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయాలని తనకూ వుంది.. కానీ మంచి మంచి కథలు.. పర్లేదు చేద్దాం అనిపించే కథలు తన దగ్గరికి రాలేదని ఈ ముద్దుగుమ్మ చెబుతోంది. కథ వస్తే కచ్చితంగా చేస్తానని చెప్పిందీ భామ. కాగా.. నాగార్జున, రకుల్ ప్రీత్ నటీనటులుగా రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన ‘మన్మథుడు 2’ ఆగస్ట్ 09న విడుదల కానున్న సంగతి తెలిసిందే.

Rakul Preet Gives Clarity on..... :

Rakul Preet Gives Clarity on..... 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ