Advertisementt

‘నాని’స్‌ గ్యాంగ్‌ లీడర్‌’ రిలీజ్ డేట్ ఫిక్స్

Fri 09th Aug 2019 06:54 PM
nani gangleader,release date,bhale bhale magadivoi,september 13  ‘నాని’స్‌ గ్యాంగ్‌ లీడర్‌’ రిలీజ్ డేట్ ఫిక్స్
Nani’s Gang Leader Release Date ‘నాని’స్‌ గ్యాంగ్‌ లీడర్‌’ రిలీజ్ డేట్ ఫిక్స్
Advertisement
Ads by CJ

సెప్టెంబర్‌ 13న వరల్డ్‌వైడ్‌గా ‘నాని’స్‌ గ్యాంగ్‌ లీడర్‌’ 

నేచురల్‌ స్టార్‌ నాని, వెర్సటైల్‌ డైరెక్టర్‌ విక్రమ్‌ కె.కుమార్‌ కాంబినేషన్‌లో మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌(సివిఎం) నిర్మిస్తున్న విభిన్న చిత్రం ‘నాని’స్‌ గ్యాంగ్‌ లీడర్‌’. ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇటీవల ఈ సినిమాకి సంబంధించి విడుదలైన ప్రీ లుక్‌కి, ఫస్ట్‌లుక్‌కి, ఫస్ట్‌ సాంగ్‌కి, టీజర్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఒక ఇంట్రెస్టింగ్‌ పాయింట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రానికి అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. నాని హీరోగా నటించిన ‘భలేభలే మగాడివోయ్‌’ చిత్రం సెప్టెంబర్‌‌లో విడుదలై బ్లాక్ బస్టర్ అయింది. మళ్ళీ ‘నాని’స్‌ గ్యాంగ్‌ లీడర్‌’ సెప్టెంబర్‌లో రిలీజ్ అవడం విశేషం.

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఒక ప్రధాన పాత్ర ఆర్‌ఎక్స్‌ 100 ఫేమ్‌ కార్తికేయ పోషిస్తున్నారు. ప్రియాంక, లక్ష్మీ, శరణ్య, అనీష్‌ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు, వెన్నెల కిశోర్‌, జైజా, సత్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. 

ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్‌ రవిచందర్‌, సినిమాటోగ్రఫీ: మిరోస్లా కుబా బ్రోజెక్‌, మాటలు: వెంకీ, రచనా సహకారం: ముకుంద్‌ పాండే, పొడక్షన్‌ డిజైనర్‌: రాజీవన్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌: రామ్‌కుమార్‌, ఎడిటింగ్‌: నవీన్‌ నూలి, వి.ఎఫ్.ఎక్స్.: మకుట, కాస్ట్యూమ్‌ డిజైనర్‌: ఉత్తర మీనన్‌, స్టిల్స్‌: జి.నారాయణరావు, కో-డైరెక్టర్‌: కె.సదాశివరావు, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: శేషు, సి.ఇ.ఓ.: చిరంజీవి(చెర్రీ), నిర్మాతలు: నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌ (సివిఎం), కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విక్రమ్‌ కె.కుమార్‌.

Nani’s Gang Leader Release Date:

Natural Star ‘Nani’s Gangleader’ Worldwide Release On September 13th

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ