Advertisementt

‘ఎర్రచీర’ మోషన్ పోస్టర్‌ వదిలిన వెంకీ

Fri 09th Aug 2019 07:25 PM
erra cheera movie,motion poster,venkatesh,satya suman babu  ‘ఎర్రచీర’ మోషన్ పోస్టర్‌ వదిలిన వెంకీ
Victory Venkatesh Launches Erra Cheera Movie Motion Poster ‘ఎర్రచీర’ మోషన్ పోస్టర్‌ వదిలిన వెంకీ
Advertisement
Ads by CJ

విక్టరీ వెంకటేష్ చేతుల మీదుగా ‘ఎర్రచీర’ మోషన్ పోస్టర్‌ విడుదల 

శ‌తాధిక చిత్రాల హీరో శ్రీ‌కాంత్ కీల‌క పాత్ర‌లో, బేబీ ఢమరి సమర్పణలో శ్రీ సుమన్‌ వెంకటాద్రి ప్రొడక్షన్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘ఎర్రచీర’. సత్య సుమన్‌ బాబు దర్శకత్వం వహిస్తున్నారు. హార‌ర్ యాక్షన్ స‌స్పెన్స్ ప్ర‌ధానంగా రూపొందుతున్న‌ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ఇది. సెప్టెంబ‌ర్ 20న సినిమా రిలీజ్ కానుంది. ‘మ‌హాన‌టి’ ఫేం బేబి సాయి తేజ‌స్వి మ‌రో ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్నారు. ‘ఎర్రచీర’ మోషన్ పోస్టర్‌ను విక్టరీ వెంకటేష్ విడుదల చేశారు.

ఈ సందర్భంగా దర్శకుడు సత్య సుమన్‌ బాబు మాట్లాడుతూ.. ‘‘ఎర్రచీర‌లో శ‌తాధిక చిత్రాల హీరో శ్రీ‌కాంత్.. బేబి సాయి తేజ‌స్విని, కారుణ్య చౌదరి, ర‌ఘుబాబు త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. క‌మల్ కామ‌రాజు, అజ‌య్, శ్రీ‌రాం.. అలీ పాత్ర‌లు ఆక‌ట్టుకుంటాయి. ఛేజింగ్‌ సీన్స్‌... హారర్‌, కామెడీ హైలైట్ చిత్రీక‌ర‌ణ ముగింపులో ఉంది. సైమ‌ల్టేనియ‌స్‌గా నిర్మాణానంత‌ర ప‌నులు పూర్త‌వుతున్నాయి. సెప్టెంబ‌ర్ 20న సినిమాని రిలీజ్ చేస్తాం. త్వరలో టీజ‌ర్ ఈవెంట్‌ని ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో ఘ‌నంగా చేయ‌నున్నాం’’ అన్నారు. ఎగ్జిక్యూటివ్ నిర్మాత తోట సతీష్‌ మాట్లాడుతూ.. ‘‘ఆగస్టు చివరి నాటికి అన్ని ప‌నులు పూర్తి చేసి సెప్టెంబ‌ర్ 20న రిలీజ్ చేస్తున్నాం. ప్రియాంక‌ అగ‌స్టిన్ - ర‌ఘుబాబు- ఫిష్ వెంకట్ ఐటెమ్ పాట సినిమాలో మ‌రో హైలైట్’’ అని తెలిపారు. 

మ‌హానటి ఫేం బేబి సాయి తేజస్విణి ప్రధాన పాత్రలు పోషిస్తుండగా శ్రీరామ్, సుమన్ బాబు, కారుణ్య, అలీ, అజయ్, మొదలగు మహానటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత‌: తోట సతీష్, మాటలు: గోపి విమల్ పుత్ర, కెమెరా-చందు, కళ-సుభాష్-నాని, మ్యూజిక్ - ప్రమోద్ పులిగిల్ల, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: సి.హెచ్. సత్య‌ సుమన్ ‌బాబు.

Victory Venkatesh Launches Erra Cheera Movie Motion Poster:

Erra Cheera Movie Motion Poster Launched

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ