అవును.. దగ్గుబాటి రానాకు సీనియర్ నటి హ్యాండిచ్చేసిందట. ప్రస్తుతం ఈ వ్యవహారం టాలీవుడ్, బాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయ్యింది. అసలేం జరిగింది..? ఇంతకీ హ్యాండిచ్చిన సీనియర్ నటి ఎవరనేది..? ఇప్పుడు చూద్దాం. ఒకప్పుడు టాలీ, కోలీ, బాలీవుడ్ చిత్రాలతో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన ఈ ముద్దుమ్మ, స్టిల్ బ్యాచిలర్ ‘టబు’. లాంగ్ గ్యాప్ తర్వాత ఈ భామ టాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇస్తోంది.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్-మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో కీలక పాత్రలో నటిస్తున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన విషయం విదితమే. అయితే ఈ పాత్ర నెగిటివ్‌గా ఉంటుందని పుకార్లు వస్తున్నాయి. అయితే ఈ సినిమాతో పాటు దగ్గుబాటి రానా-సాయిపల్లవి జంటగా నటిస్తున్న ‘విరాట పర్వం’లో ఓ ప్రధాన పాత్రలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అప్పట్లో తెగవార్తలు వచ్చాయి. అయితే ఏం జరిగిందో ఏమోగానీ.. బన్నీ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన టబు.. రానాకు మాత్రం రెడ్ సిగ్నల్ ఇచ్చిందట. దీంతో రానాకు సీనియర్ నటి హ్యాండిచ్చిందంటూ వెబ్‌సైట్లు పెద్ద ఎత్తున వార్తలు రాసేస్తున్నాయి.
అదేనండి.. ‘విరాట పర్వం’ చిత్రంలో తాను చేయట్లేదని తేల్చిచెప్పేసిందట. అయితే ఈమె నో చెప్పి తప్పుకోవడంతో.. అదే పాత్రకు కథ చెప్పి.. సీనియర్ నటి నందిత దాస్‌ను ఫిక్స్ చేసేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ముందు ఒప్పుకొని టబు ఎందుకిలా చేసింది..? అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వలేదా..? మరో కారణం ఏమైనా ఉందా అనేది తెలియాల్సి ఉంది.