సాయిపల్లవి, ఫహద్ ఫాసిల్, ప్రకాష్ రాజ్, అతుల్ కులకర్ణి నటించిగా.. మలయాళం రిలీజ్ అయ్యి ఘన విజయం సాధించిన సినిమా ‘అధిరన్’. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు కోసం అనువదిస్తున్న ఈ చిత్రానికి ‘అనుకోని అతిథి’ అని టైటిల్ పెట్టారు నిర్మాతలు. కొన్ని రోజుల క్రితం మలయాళంలో విడుదలైన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ కేరళలో భారీ విజయం సాధించింది. ఈ చిత్రాన్ని జయంత్ ఆర్ట్స్ బ్యానర్‌పై శ్రీమతి దీప సురేందర్ రెడ్డి సమర్పణలో ప్రముఖ నిర్మాత అన్నంరెడ్డి కృష్ణకుమార్ తెలుగులో అనువదిస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ‘‘కేరళలో 1970లలో వాస్తవంగా జరిగిన ఘటనల ఆధారంగా రూపొందిన చిత్రమిది. సాయి పల్లవితో పాటు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులైన ప్రకాశ్‌రాజ్ మరియు అతుల్ కులకర్ణి ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రభాస్ ‘సాహో’కి నేపథ్య సంగీతం అందిస్తున్న జిబ్రాన్ ఈ చిత్రానికి అద్భుతమైన నేపథ్య సంగీతం ఇచ్చారు. ప్రస్తుతం అనువాద కార్యక్రమాలు పూర్తి అయ్యి మిక్సింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఫస్ట్ లుక్ మరియు ట్రైలర్ రిలీజ్ చేసి త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని అనుకుంటున్నాం’’ అని నిర్మాతలు చెప్పారు.
ప్రకాశ్‌రాజ్, అతుల్ కులకర్ణి, రెంజి పానికర్, లియోనా లిషోయ్, శాంతి కృష్ణ తదితరులు నటించిన ఈ చిత్రానికి పీఆర్వో: సురేంద్ర కుమార్ నాయుడు - ఫణి కందుకూరి, మాటలు: ఎం. రాజశేఖర్‌రెడ్డి, పాటలు: చరణ్ అర్జున్, మధు పమిడి కాల్వ, ఎడిటింగ్: అయూబ్ ఖాన్, కెమెరా: అను మోతేదత్, స్ర్కీన్‌ప్లే: పి.ఎఫ్. మాథ్యూస్, నేపథ్య సంగీతం: జిబ్రాన్, సంగీతం: పి.ఎస్. జయహరి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: దక్షిన్ శ్రీన్వాస్, సమర్పణ: శ్రీమతి దీప సురేందర్ రెడ్డి; నిర్మాతలు: అన్నంరెడ్డి కృష్ణకుమార్, గోవింద రవికుమార్; దర్శకత్వం: వివేక్.