Advertisementt

‘మన్మథుడు 2’ని సామ్ వదిలేసిందిగా?

Sun 11th Aug 2019 03:33 PM
samantha,manmadhudu 2,tweet,heroine samantha,akkineni fans  ‘మన్మథుడు 2’ని సామ్ వదిలేసిందిగా?
Samantha not Reacted on Nag Manmadhudu 2 ‘మన్మథుడు 2’ని సామ్ వదిలేసిందిగా?
Advertisement
Ads by CJ

కింగ్ నాగార్జున లేటెస్ట్ మూవీ మన్మథుడు 2 డివైడ్ టాక్ వచ్చినా పర్లేదు అనిపించుకుంది. అయితే ఈ సినిమా రిలీజ్ తరువాత కోడలు సమంత ఇంతవరకు తన రివ్యూ ఇవ్వలేదు. సినిమా ఎలా ఉంది? నాగ్ గురించి కానీ ఎటువంటి ట్వీట్ చేయలేదు సామ్. మన్మథుడు 2 ట్రైలర్ రిలీజ్ అప్పుడు ట్వీట్ చేసింది అంతే తరువాత ఎటువంటి ట్వీట్ చేయలేదు. సామ్ తన ఫ్యామిలీ సినిమాల విషయంలో బిగ్ ప్రమోటర్. కానీ ఇప్పుడిలా చేస్తున్నారేంటో?

సామ్ కి నాగ్ ఈ వయసులో ఘాటైన రొమాన్స్ చేయడం.. ముద్దులివ్వడం నచ్చలేదట. ఈ విషయాన్నీ నాగ్ పబ్లిగ్గా రివీల్ చేశారు కూడా. కానీ నాగ్ మాత్రం ఓ బేబీ సక్సెస్ విషయంలో చాలా ఆనందం వ్యక్తం చేశారు. సినిమాని ప్రమోట్ కూడా చేసారు. కానీ కోడలు మాత్రం కనీసం ఒక ట్వీట్ కూడా వేయలేదు.

సామ్ పెళ్లి తరువాత ఎంతో స్వేచ్ఛగా బోల్డ్ అవతారంలో కనిపించినప్పుడు లేనిది? ఇప్పుడు ఎందుకు కండిషన్స్ పెడుతుందో? నాగ్ కోసం కాకపోయినా తన బెస్ట్ ఫ్రెండ్ చిన్మయి కోసం, తన భర్త రాహుల్ కోసం అన్న ఒక ట్వీట్ వేస్తే నష్టం ఏంటంటా? పైగా ఈసినిమాలో సామ్ ఓ గెస్ట్ రోల్ చేసింది. ప్రస్తుతం ఇదే అభిమానుల్లో ఆసక్తిగా ముచ్చట సాగుతోంది. 

Samantha not Reacted on Nag Manmadhudu 2:

Samantha not Interested on Manmadhudu 2

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ