Advertisementt

చెర్రీకి అవార్డు రాకుండా చేసింది ఆయనేనా!?

Sun 11th Aug 2019 09:02 PM
rangasthalam,mahanati,national awards,injustice,big producer,rangasthalam movie,ram charan  చెర్రీకి అవార్డు రాకుండా చేసింది ఆయనేనా!?
Justice to Mahanati.. injustice to Rangasthalam చెర్రీకి అవార్డు రాకుండా చేసింది ఆయనేనా!?
Advertisement
Ads by CJ

జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో ‘మహానటి’ చిత్రం ఉత్తమ చిత్రంగా నేషనల్‌ అవార్డ్‌ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఉత్తమ నటిగా కీర్తి సురేష్‌ని ఎంపిక చేయడం జరిగింది. అయితే ‘మహానటి’కి న్యాయం జరిగిందని చిత్రబృందంతో పాటు తెలుగు సినీ ప్రేక్షకులు ఆనందిస్తుంటే.. మెగాభిమానులు తెగ బాధపడిపోతున్నారట. ఉత్తమ నటుడి అవార్డు ‘రంగస్థలం’ సినిమా కోసం చిట్టిబాబుకి దక్కాలనీ మెగా అభిమానులు సోషల్ మీడియావేదికగా గోల చేస్తున్నారట. మా చిట్టి బాబుకు అన్యాయం జరిగిందని.. కొందరు చెర్రీ అంటే పడనివాళ్లు ఇలా చేశారని వీరాభిమానులు ఆరోపిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. మెగా ఫ్యామిలీ అంటే పడని టాలీవుడ్‌కు చెందిన ఓ బడా నిర్మాత చెర్రీకి అన్యాయం చేశారని.. ఆయనే ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్‌ చేసి.. అంతా చెడగొట్టాడనే ప్రచారం పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే ఆ బడా నిర్మాత ఎవరన్న విషయం మాత్రం తెలియరాలేదు. జాతీయ స్థాయిలో ఇలాంటి చిత్రాలను ప్రోత్సహించకపోతే, భవిష్యత్తులో స్టార్‌ హీరోలు ఇలాంటి పాత్రల జోలికి పోరని ‘రంగస్థలం’ ఖచ్చితంగా అవార్డు విన్నింగ్‌ చిత్రమనీ ముందే ఊహించామని అభిమానులు చెబుతున్నారు. మరి ఈ ఆరోపణలు ఎంత వరకు నిజమో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.

Justice to Mahanati.. injustice to Rangasthalam:

National Awards: Politics Against Rangasthalam

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ