Advertisementt

‘మన్మథుడు-2’ అమలకు బాగా నచ్చాడు!

Sun 11th Aug 2019 09:37 PM
amala akkineni,manmadhudu 2,nagarjuna,happy,comedy,reaction  ‘మన్మథుడు-2’ అమలకు బాగా నచ్చాడు!
Amala Akkineni Reaction on Manmadhudu 2 Movie ‘మన్మథుడు-2’ అమలకు బాగా నచ్చాడు!
Advertisement
Ads by CJ

అక్కినేని నాగార్జున, రకుల్ ప్రీత్‌సింగ్ నటీనటులుగా రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిన చిత్రం ‘మన్మథుడు 2’. ఆగస్ట్-09న మన్మథుడుగా అభిమానుల ముందుకు వచ్చిన నాగ్ మంచి హిట్ టాక్ సంపాదించుకున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో నాగార్జున వయసు మళ్లినా పెళ్లి కాని బ్రహ్మచారి పాత్రలో డిఫరెంట్‌గా కనిపించి అందర్నీ మెప్పించారు. ఇవన్నీ ఒక ఎత్తయితే కామెడీ మాత్రం కిరాక్ అనిపించింది. ఈ సినిమాను చూసిన పలువురు ప్రముఖులు, వీరాభిమానులు సోషల్ మీడియా వేదికగా అక్కినేనికి కంగ్రాట్స్ చెబుతూ.. చిత్రబృందాన్ని మెచ్చుకుంటున్నారు. అయితే తాజాగా నాగ్ సతీమణి అమల ట్విట్టర్ ద్వారా రియాక్ట్ అయ్యారు.

మన్మథుడు-2 సినిమా చూస్తున్నంతసేపు నవ్వాపుకోలేకపోయానని చెప్పుకొచ్చారు. సినిమాలోని కొన్ని సీన్లు చూసి నవ్వి.. నవ్వి సీట్లోంచి కిందపడిపోయానని తెలిపారు. ‘మన్మథుడు-2’ ఎంతో నచ్చిందని, ఇది పూర్తిగా నవతరం చిత్రం అని అమల అభిప్రాయపడ్డారు. ఇందుకు అక్కినేని అభిమానులు, సినీ ప్రియులు పెద్ద ఎత్తున కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరికొందరు అభిమానులు మాత్రం మేడమ్.. ఇదేం సినిమా.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Amala Akkineni Reaction on Manmadhudu 2 Movie:

I am so Happy with Manmadhudu 2 Movie says Amala Akkineni

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ