బాలీవుడ్, హాలీవుడ్‌లోకి అలనాటి పోర్న్ స్టార్లు అడుగుపెడుతున్న విషయం విదితమే. అయితే వాళ్లు ఎవరు..? అనే విషయం ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. తాజాగా ఒకప్పటి పోర్న్ స్టార్.. ప్రస్తుతం మాజీ అయిన ‘మియా ఖలీఫా’ ఓ ఇంటర్వ్యూ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మియా ఓ మతానికి చెందిన యువతి కావడంతో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు పోర్న్ మానేయాలని పలుమార్లు హెచ్చరించారట. దీంతో దెబ్బకు పోర్న్ చిత్రాల్లో నటించడం మానేసిన ఈ సెక్సీ భామ ఇంట్లో నుంచి బయటికి రావడానికి కూడా భయపడిందట.
చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చిన ఈ భామ పై విషయాలు చెప్పుకొచ్చింది. అంతేకాదు.. తనను కొందరు మోసం చేశారని.. పోర్న్ చిత్రాల్లో నటించి తానేం పెద్ద ఎత్తున సొమ్ము చేసుకోలేదని.. కొందరు మధ్యవర్తుల తనను దారుణంగా మోసం చేశారని చెప్పుకొచ్చింది. ఇన్నాళ్లు తాను పోర్న్ చిత్రాల్లో నటించగా వచ్చింది కేవలం రూ. 9లక్షలేనని ఈ భామ చెబుతోంది. మిగిలిన డబ్బులంతా మధ్యవర్తులే కాజేశారని చెబుతోంది. ఆ మధ్యవర్తులెవరనేది మియాకే తెలియాల్సి ఉంది.