టాలీవుడ్ లో చాలా రోజుల తర్వాత ‘ఎవరు’ సినిమాతో హిట్ అందుకుంది హీరోయిన్ రెజీనా కాసాండ్రా. ఎన్నో రోజులనుండి కెరీర్ లో బ్రేకిచ్చే సినిమా కోసం ఎదురు చూస్తుంది ఈ భామ. కెరీర్ ఆరంభంలో చాలా పద్దతిగా కనిపించిన రెజీనా అవకాశాలు సన్నగిల్లడంతో.. గ్లామర్ చూపించడం మొదలుపెట్టింది. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో నటించినా, సందీప్ కిషన్ పక్కన నటించినా.. అమ్మడుకి అస్సలు క్రేజ్ రాలేదు. ఇక టాలీవుడ్ లో కెరీర్ ముగిసిపోయే టైంలో కోలీవుడ్ కి చెక్కేసి అక్కడ అందాలు ఆరబోస్తూ కాస్త సక్సెస్ అయ్యింది. ఇక టాలీవుడ్ విలన్ కమ్ హీరో అడవి శేష్ హీరోగా తెరకెక్కిన ‘ఎవరు’ సినిమాలో రెజీనా హీరోయిన్ గా నటించింది. ‘ఎవరు’ సినిమా సక్సెస్ మీద భారీ ఆశలు పెట్టుకున్న రెజీనాకి ఆ సినిమా కావాల్సినంత సక్సెస్ తెచ్చిపెట్టింది.
‘ఎవరు’ సినిమా కథ మొత్తం రెజీనా చుట్టు తిరిగేలా దర్శకుడు కథ రాసుకున్నాడు. ఇక సినిమాలో రెజీనా నటనకు మంచి మార్కులు పడ్డాయి. అలాగే రెజీనా కూడా గ్లామర్ గా చాలా స్పైసీగా కనిపించింది. సినిమాలో అద్భుతమైన నటన కనబర్చిన రెజీనా ‘ఎవరు’ రిలీజ్ ప్రమోషన్స్ లో పాల్గొంటూ మీడియాకి స్పెషల్ ఇంటర్వ్యూస్ ఇస్తుంది. ఇక తాజాగా జరిగిన ఎవరు ఈవెంట్ కి రెజీనా అదిరిపోయే గ్లామర్ డ్రెస్ తో క్లివేజ్ అందాలతో అదరగొట్టేసింది. ఎక్కువగా ఇలాంటి స్పైసీ అందాలు మనకి బాలీవుడ్ భామల విషయంలో నిత్యం దర్శనమిస్తాయి.
కానీ రెజీనా మాత్రం నాకేం తక్కువ నేను రెచ్చిపోతా.. అంటూ గ్లామర్ ని అలవోకగా చాలా హాట్ అండ్ స్పైసీగా ఆరబోసింది. ఇక రెజీనా సైడ్ యాంగిల్ లో ఆమె క్లివేజ్ షోకి ఫోటో గ్రాఫర్స్ కూడా ఎగబడి ఆమె ఫొటోస్ తీసేసారు. మరి రెజీనా నీకింత స్పైసీ నెస్ అవసరమా... అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.