Advertisementt

‘పహిల్వాన్’ ట్రైల‌ర్ విడుద‌ల‌.. రిలీజ్ ఎప్పుడంటే?

Fri 23rd Aug 2019 02:03 PM
pehlwaan,movie,release,september 12  ‘పహిల్వాన్’ ట్రైల‌ర్ విడుద‌ల‌.. రిలీజ్ ఎప్పుడంటే?
Pehlwaan Trailer Launched ‘పహిల్వాన్’ ట్రైల‌ర్ విడుద‌ల‌.. రిలీజ్ ఎప్పుడంటే?
Advertisement
Ads by CJ

‘పహిల్వాన్’ ట్రైల‌ర్ విడుద‌ల‌... సెప్టెంబ‌ర్ 12న గ్రాండ్ రిలీజ్‌

శాండిల్ వుడ్ బాద్షా.. ‘ఈగ’ ఫేమ్ కిచ్చా సుదీప్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం ‘పహిల్వాన్’.  ఎస్‌.కృష్ణ ద‌ర్శ‌కుడు. ఈ సినిమాను ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ వారాహి చ‌ల‌న చిత్రం తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నారు. ఈ యాక్ష‌న్ డ్రామాలో సుదీప్ రెజ్ల‌ర్ పాత్ర‌లో క‌నిపిస్తారు. తెలుగులోనూ ‘పహిల్వాన్’ అనే పేరుతో సెప్టెంబ‌ర్ 12న‌ ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు. 

ఈ చిత్రంలో బాలీవుడ్ న‌టుడు సునీల్ శెట్టి, ఆకాంక్ష సింగ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఇటీవ‌ల మెగాస్టార్ చిరంజీవి విడుద‌ల చేసిన ‘పహిల్వాన్’ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది. గురువారం ఈ సినిమా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు.  ఈ ట్రైల‌ర్‌కు ట్రెమెండ‌స్ రెస్పాన్స్ వ‌స్తుంది. 

అర్జున్ జ‌న్యా సంగీతం అందించిన ఈ సినిమాకు క‌రుణాక‌ర్ సినిమాటోగ్ర‌ఫీ అందించారు. ‘కె.జి.య‌ఫ్‌’ చిత్రాన్ని తెలుగులో విడుద‌ల చేసి ఘ‌న విజ‌యాన్ని అందుకున్న వారాహి చ‌ల‌న చిత్రం ఇప్పుడు ‘పహిల్వాన్’ చిత్రాన్ని సెప్టెంబ‌ర్ 12న  గ్రాండ్ రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. 

ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: ఎస్‌.కృష్ణ‌

బ్యాన‌ర్‌:  వారాహి చ‌ల‌న చిత్రం

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌:  ఎస్‌.దేవ‌రాజ్‌

కెమెరా:  క‌రుణాక‌ర్‌.ఎ

ఎడిట‌ర్‌:  రూబెన్‌

ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌:  శివ‌కుమార్‌

కుస్తీ:  ఎ.విజ‌య్‌

బాక్సింగ్‌:  లార్లెల్ స్టోవాల్‌

స్టంట్స్‌:  రామ్ లక్ష్మ‌ణ్, కె.ర‌వివ‌ర్మ‌

కొరియోగ్ర‌ఫీ:  గ‌ణేశ్ ఆచార్య‌, రాజు సుంద‌రం

ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్‌:  సాగ‌ర్ గౌడ‌

స్క్రీన్‌ప్లే:  కృష్ణ‌, మ‌ధు, క‌న్న‌న్‌

డైలాగ్స్‌:  హ‌నుమాన్ చౌద‌రి

పాట‌లు:  రామ‌జోగయ్య‌శాస్త్రి

వి.ఎఫ్‌.ఎక్స్:  రెడ్ చిల్లీస్‌, లైబ్రింత్‌

డి.ఐ: ప‌్ర‌సాద్ ల్యా్స్‌(ముంబై)

కాస్ట్యూమ్స్‌:  యోగి, చేత‌న్‌, గ‌ణేశ్‌

ప్రొడ‌క్ష‌న్ మేనేజ‌ర్‌:  మైసూర్ సురేశ్‌

డైరెక్ష‌న్ టీం:  వికాస్ విశ్వ‌నాథ్‌, ప్ర‌ద్యుమ్న న‌ర‌హ‌ల్లి, అనీల్ విజ్జి, తేజ్ వ‌ర్ధ‌న్‌

స్టిల్స్:  క‌దూర్ ర‌ఘు 

ప‌బ్లిసిటీ డిజైన్‌:  ధ‌ని ఏలే, కానీ స్టూడియో

Pehlwaan Trailer Launched:

Pehlwaan Movie Release on September 12th

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ