Advertisementt

‘సాహో’కు కొత్త తలనొప్పి.. !

Sat 24th Aug 2019 01:15 PM
prabhas,saaho,run time,tollywood  ‘సాహో’కు కొత్త తలనొప్పి.. !
News About Prabhas SAAHO ‘సాహో’కు కొత్త తలనొప్పి.. !
Advertisement
Ads by CJ

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, శ్రద్ధా కపూర్ నటీనటులుగా సుజిత్ తెరకెక్కించిన భారీ బడ్జెట్ చిత్రం ‘సాహో’. ఆగస్టు 30న థియేటర్లలోకి రానున్న ఈ చిత్రానికి ఇప్పటికే సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ కూడా ఇచ్చేసింది. సినిమాను నిశితంగా చూసిన బోర్డు సభ్యులు యూ/ఏ సర్టిఫికేట్‌ ఇవ్వడం జరిగింది. సినిమా రన్‌ టైమ్‌ 171: 52 నిమిషాలు అంటే 2: 51 గంటలు అన్న మాట. 

ఇప్పటి వరకూ వచ్చిన ఫస్ట్ లుక్స్ మొదలుకుని ప్రమోషన్స్ అన్నీ ఓకే కానీ.. 2:51 గంటలు ప్రేక్షకులను సీట్లో ‘సాహో’ కూర్చోబెడతాడా లేదా అనేది చిత్రబృందం ముందున్న ఏకైక ప్రశ్న. మామూలుగానే సినిమా అంటే ఈ రేంజ్‌లో ఉండదు.. ఎక్కడ ప్రేక్షకులకు బోర్ కొడుతుందో.. బెడిసికొడుతుందో లేని పోని తలనొప్పులు ఎందుకని దగ్గరుండి మరీ ‘సైరా’కు మెగాస్టార్ చిరంజీవి కత్తెరపట్టారు. అంటే చిరు ముందస్తు జాగ్రత్త పడ్డారన్న మాట.

మరి సాహో పరిస్థితేంటి..? నిజంగా ఇది చిత్రబృందానికి ఒక తలనొప్పే.. ఇప్పటికే సెన్సార్‌లు అన్నీ అయిపోయాయ్ కాబట్టి చేసేదేమీ లేదు. ఉన్నదల్లా స్టోరీలో కంటెంట్ ఉంటే సరే లేకుంటే హుష్ కాకీ అంతే. మరి ఈ కొత్త తలనొప్పి నుంచి ‘సాహో’ ఏ మాత్రం తప్పించుకుని ప్రేక్షకులను సీట్లలో కూర్చోబెడతారో లేకుంటే బయటికి పంపించేస్తాడో తెలియాలంటే థియేటర్లలోకి వచ్చేంత వరకూ వేచి చూడాల్సిందే మరి.

News About Prabhas SAAHO:

News About Prabhas SAAHO

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ