స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్ లో ‘అల వైకుంఠపురంలో’ అనే సినిమా చేస్తున్నాడు. దీన్ని సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు. ఈమూవీ తరువాత అల్లు అర్జున్ ఏ సినిమా చేయాలో అప్పుడే డిసైడ్ అయ్యిపోయాడు. దీని తరువాత బన్నీ దిల్ రాజు బ్యానర్ లో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘ఐకాన్’ అనే సినిమా చేయనున్నాడు.
పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న ఈ సినిమాలో హీరోయిన్ ని ఫైనల్ చేసినందుకు నానా తంటాలు పడుతున్నారు దిల్ రాజు అండ్ టీం. అల్లు అర్జున్ కోరిక మేరకు ఈ మూవీలో అలియా భట్ ను తీసుకుంద్దాం అనుకున్నారు. తద్వారా బాలీవుడ్ లో అల్లు అర్జున్ కి మార్కెట్ ఏర్పడుతుందని భావించాడు. ప్రస్తుతం ఆమె తెలుగులో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నటిస్తోంది. అయితే బన్నీ కోసం ఆమెను సంప్రదిస్తే వెంటనే నో చెప్పేసిందని టాక్. ‘ఐకాన్’ కమర్షియల్ సినిమా అన్న కారణంతోనే ఆమె రిజక్ట్ చేసిందని చెబుతున్నారు.
దీంతో వేరే బాలీవుడ్ హీరోయిన్ కోసం సెర్చ్ చేస్తున్న టైములో ‘లోఫర్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన దిశా పటానిని సంప్రదించగా ఆమె భారీగా రెమ్యునరేషన్ ను డిమాండ్ చేసిందట. దీంతో మరోసారి షాక్ తిన్నాడు దిల్ రాజు అండ్ బన్నీ. మరి దిశా అడిగినంత ఇస్తారా? లేదా వేరే హీరోయిన్ ని వెతుకుంటారా? అనేది చూడాలి.