Advertisementt

గ్రాండ్‌గా మార్షల్ చిత్ర ఆడియో ఆవిష్కరణ

Mon 26th Aug 2019 07:15 PM
marshal,audio release,guntur,abhay,megha chowdary  గ్రాండ్‌గా మార్షల్ చిత్ర ఆడియో ఆవిష్కరణ
Marshal Audio Launch Details గ్రాండ్‌గా మార్షల్ చిత్ర ఆడియో ఆవిష్కరణ
Advertisement
Ads by CJ

అభయ్, మేఘా చౌదరి జంటగా నటించిన చిత్రం ‘మార్షల్’. హీరో శ్రీకాంత్ ఓ ముఖ్యమైన పాత్ర పోషించిన ఈ చిత్రాన్ని హీరో అభయ్ తన సొంత బ్యానర్ లోనే నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జై రాజాసింగ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెప్టెంబరు 19న విడుదలవుతోంది. ఈ చిత్రం ఆడియో, టీజర్ అవిష్కరణ ఇటీవలే గుంటూరులో జరిగింది. 

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే అంబటి రాంబాబు హాజరై... ఆడియోను ఆవిష్కరించారు. ఆయనతో పాటు షేక్ మహమ్మద్ ముస్తఫా, మద్దాలి గిరి, వైఎస్ఆర్సిపి పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు అప్పిరెడ్డి, పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త చంద్రగిరి ఏసురత్నం, ముస్తఫా మరియు మద్దాల గిరి, బోనబోయిన శ్రీనివాసయాదవ్, నిమ్మకాయల రాజా నారాయణ, చిత్రంలోని హీరోయిన్ మేఘన చౌదరి, డైరెక్ట్ జై రాజాసింగ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఆడియో సీడీని ఆవిష్కరించిన ఎమ్మెల్యే అంబటి రాంబాబు మాట్లాడుతూ..హీరో అభయ్ కథానాయకుడిగా.. నిర్మాతగా ఈ చిత్రాన్ని నిర్మించి... తన జన్మస్థలమైన గుంటూరులోనే ఆడియో ఆవిష్కరణ వేడుక జరుపుకోవడం ఎంతో సంతోషకరం. ఈ చిత్రం ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నా.. అన్నారు. 

‘కెజిఎఫ్’ మ్యూజిక్ ఫేమ్ రవిబసురి తెలుగు సినిమా మార్షల్ సినిమా కంటెంట్ ప్రత్యేకంగా నచ్చి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మరి ఈ సినిమాలో రీ రికార్డింగ్ తో పాటు 2 పాటలను సమకూర్చాడు

నిర్మాత, హీరో అభయ్ అడకా మాట్లాడుతూ.. నేను పుట్టి పెరిగిన గుంటూరులో నా తొలిచిత్రం ఆడియో ఫంక్షన్ ను ఇంత మంది పెద్దల సమక్షంలో చేయడం ఆనందంగా వుందన్నారు. ఇదో వైవిద్యభరితమైన చిత్రం. మార్షల్ తో ఓ మంచి మెసేజ్ ఇవ్వబోతున్నాం. ప్రతి ఒక్కరికీ నచ్చుతుందని తెలిపారు. 

దర్శకుడు మాట్లాడుతూ.. సినిమా అన్ని తరహాల వారికి నచ్చేలా ఉంటుందని, నిర్మాత మరియు హీరో అభయ్ అడకా పాత్ర ఎంతో హుందాగా, నూతనంగా ఉంటుందని వివరించారు. సినీ హీరో శ్రీకాంత్ ఈ సినిమాలో ఒక మరచిపోలేని పాత్రకు ప్రాణం పోశారని చెప్పారు. 

ఆర్.యం.స్వామి సినిమాటోగ్రఫీ, సంగీతం యాదగిరి వరికుప్పల, ఫైట్స్ నాభ మరియు సుబ్బుల పనితనం చిత్రానికి ఎసెట్స్‌గా నిలుస్థాయి. నిర్మాత ఈ సినిమా ప్రారంభం నుంచి  మాకు ఎంతో సపోర్ట్ చేస్తూ వచ్చారని తెలిపారు.  

ఈ కార్యక్రమంలోని నటీనటులు కల్పవల్లి జబర్దస్త్ టీం అప్పారావు, నవీన్, ప్రొడ్యూసర్ వెంకటేశ్వర రావు, శ్రీనివాస రావు, సంగీత దర్శకులు యాదగిరి, గణేష్ మాస్టర్ తదితరులు పాల్గొన్నారు.

Marshal Audio Launch Details:

Marshal Audio Released at Guntur

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ