సినీ రాజకీయ ప్రముఖుల మధ్యలో భీమవరం టాకీస్ శివ 143 పోస్టర్ లాంచ్
శైలేష్, ఏఇషా ఆదరహ హీరో హీరోయిన్లుగా భీమవరం టాకీస్ బ్యానర్‌లో రామసత్యనారాయణ నిర్మించిన చిత్రం ‘శివ 143’. ఈ మూవీ పోస్టర్ లాంచ్ సినీ రాజకీయ ప్రముఖుల మధ్య జరిగింది. నిర్మాత రామసత్యనారాయణకి ఈ సభలో సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, నటుడు పృథ్వీ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘నేను సీనియర్ ఎన్టీఆర్‌గారికి పెద్ద అభిమానిని.. ఆయన అన్ని సినిమాలు చూసాను, నటులంటే నాకు గౌరవం ఇంట్లో కాలక్షేపం కోసం సీరియల్స్ చూస్తూ ఉంటాను, నటులంటే నాకు చాలా గౌరవం. ఈరోజు మా రామ సత్యనారాయణ నిర్మించిన శివ 143 సినిమా పోస్టర్ లాంచ్ చెయ్యడం ఆనందంగా ఉంది. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా..’’ అన్నారు.
పృథ్వీ మాట్లాడుతూ.. రామసత్యనారాయణ నాకు మంచి మిత్రుడు, ఆయన నిర్మించబోయే అన్ని సినిమాలు సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. శివ 143 టీజర్ బాగుంది. ఈ సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్న, రామసత్యనారాయణ ఇలానే సినిమాలు నిర్మించి మరెంతో మంది కొత్తవారిని ఇండస్ట్రీకి పరిచయం చెయ్యాలని కోరుకుంటున్నా.. అన్నారు.
రామసత్యనారాయణ మాట్లాడుతూ...శివ 143 సినిమా బాగా వచ్చింది. నటీనటులు అందరూ కష్టపడి పనిచేశారు. అందరికి నచ్చే సినిమా తీశానని భావిస్తున్నాను. ఈ సినిమా పోస్టర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు, ఓంకార్ రాజు గారి చేతుల మీదుగా విడుదలవ్వడం సంతోషం. హీరో కమ్ డైరెక్టర్ శైలేష్ ఈ సినిమాను కష్టపడి చేసాడు. ఎడిటర్, హీరోయిన్ మిగిలిన నటినటులందరికి ఈ సినిమా మంచి పేరు తెచ్చి పెడుతుందని నమ్మకం ఉందన్నారు.
శైలేష్ మాట్లాడుతూ.. రామసత్యనారాయణ గారితో పనిచేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. గతంలో వారితో సినిమా చేసాను. మళ్లీ నన్ను నమ్మి ఈ సినిమా నాకు ఇచ్చారు. హీరోగా దర్శకుడిగా ఈ సినిమా నాకు బ్రేక్ ఇస్తుందని భావిస్తున్నాను. సినీ రాజకీయ ప్రముఖులు మధ్య మా సినిమా పోస్టర్ లాంచ్ అవ్వడం ఆనందంగా ఉంది. శివ 143 అందరికి నచ్చే సినిమా అవుతుందని భావిస్తున్నాను అన్నారు.