Advertisementt

చెర్రీ.. ‘సైరా’పై వస్తున్న పుకార్లు నిజమేనా!!

Fri 30th Aug 2019 03:15 PM
ram charan,rumours,syeraa,release date,megastar chiranjeevi  చెర్రీ.. ‘సైరా’పై వస్తున్న పుకార్లు నిజమేనా!!
Ram Charan Rubbishes rumours around Syeraa చెర్రీ.. ‘సైరా’పై వస్తున్న పుకార్లు నిజమేనా!!
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో సురేందర్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘సైరా’. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్-02న విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన లుక్స్, మేకింగ్ వీడియోలు సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. ఇటీవలే ఇందుకు సంబంధించిన మేకింగ్ వీడియో, పవన్ వాయిస్‌ చూసి మెగా ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా..? అటు మెగాభిమానులు.. ఇటు సినీ ప్రియులు ఎంతగానో వేచి చూస్తున్నారు. సరిగ్గా ఇదే టైమ్‌లో సైరాకు సంబంధించి ఓ బ్యాడ్ న్యూస్ నెట్టింట్లో, వెబ్‌సైట్లలో పెద్ద ఎత్తున పుకారు చేస్తోంది.

అక్టోబర్-02ను సినిమా విడుదల కావట్లేదు.. వారం గ్యాప్ తీసుకుని అక్టోబర్-08 రిలీజ్ చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇందుకు కారణం.. బాలీవుడ్ మూవీ వార్ అంటూ చర్చ నడుస్తోంది. హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా భారీ బడ్జెట్ చిత్రం ‘వార్’ అక్టోబర్ 2న విడుదల కానుండటంతో సాహో దర్శక నిర్మాతలు రిలీజ్‌ను పోస్ట్ పోన్ చేయాలని భావిస్తున్నారట. అయితే ఇది ఎంతవరకు నిజమో.. అబద్ధమో అనేది తెలియాలంటే దర్శకనిర్మాతలు.. మరీ ముఖ్యంగా చెర్రీ స్పందించి క్లారిటీ ఇవ్వాల్సిందే మరి.

Ram Charan Rubbishes rumours around Syeraa:

Ram Charan Rubbishes rumours around Syeraa  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ